ఆ హీరోయిన్.. తెలుగులో మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. అయినా సరే ఆమెకు ఆ సినిమా తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు..సరే అని వేరే ఇండస్ట్రీలో కూడా ట్రై చేసింది. అక్కడా దురదృష్టవశాత్తు ఆమెకు ఒక్క అవకాశం కూడా రాలేదు.ఇక చేసేదేమీ లేక, రెండేళ్ల నుండి ఖాళీగా ఇంట్లో కూర్చుంది. ఇలాంటి టైంలోనే ఆమెకు రవితేజ లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. తన కొత్త సినిమాలో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు, ఐతే ఈ అవకాశం వెనుక చైతు రికమండేషన్ ఉందట.

సహజంగా నాగచైతన్య తన సినిమాల కోసమే ఎవర్నీ రికమండ్ చెయ్యడు, కానీ ఆమె కోసం చైతుకి తప్పలేదు అట. అసలు హీరోయిన్లకు దూరంగా ఉండే చైతు.. ఆమెను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు ? ఇంతకీ ఆమె ఎవరంటే.. బాలీవుడ్ బ్యూటీ దివ్యాంశ కౌశికే. నిజంగా ఈ బ్యూటీ టాలెంట్ పరంగా, గ్లామర్ పరంగా ఏ మాత్రం వంకపెట్టలేని హీరోయిన్. మజిలీ సినిమాలో క్రికెటర్ చైతుకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయినా ఆ తరువాత ఈ బాలీవుడ్ బ్యూటీకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మజిలీలో నార్త్ ఇండియన్ అమ్మాయిగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ ఆకట్టుకున్నా.. మూడేళ్లు ఖాళీగా కూర్చింది. మధ్యమధ్యలో మజిలీ టీమ్ తో టచ్ లో ఉంటూ.. ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసింది.

కానీ ఎందుకో దివ్యాంశ కౌశిక్ ను ఏ డైరెక్టర్ పట్టించుకోలేదు. మజిలీలో ఓవర్ యాక్టింగ్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్ గా నటించినా ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు. మజిలీలో హీరోయిన్ గా క్రెడిట్ మొత్తం సమంతకే వెళ్ళిపోవడం, సమంత హవాలో దివ్యాంశ కేవలం సెకెండ్ హీరోయిన్ గానే మిగిలిపోవడం.. ఇలా ఆమె కెరీర్ కి అది పెద్ద మైనస్ అయింది. ఇది అర్ధం చేసుకున్న చైతు ఆమెను రవితేజ సినిమాకి సిఫార్సు చేశాడట. దాంతో మూడేళ్ళ నిరీక్షణ తరువాత దివ్యాంశకు సినిమా వచ్చింది..మొత్తానికి మన చైతూ తన హీరోయిన్ ని అలా ఆదుకున్నాడన్నమాట..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here