కొంతమందికి ప్రయాణాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే.. కొంచెం దూరం ప్రయాణం చేసినా వాళ్లు వాంతులు చేసుకుంటారు. అలా అని అన్ని వాహనాలపై ప్రయాణానికి ఉంటుందని కాదు.. కొంతమందికి బస్సు పడదు, మరికొంతమందికి ఆటో.. మరికొంతమందికి బైక్ ఇలా చాలా వరకు ఉంటాయి.

ఇంకా కొంతమందికి రైలు ప్రయాణం అంటే కూడా భయపడుతుంటారు. దీనికి మెయిన్ కారణం వాంతులు అవుతాయనే కారణం. అందుకే ఇలాంటి సమస్య ఉన్నవాళ్లు ప్రయాణం చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఏం చేయాలి.. ఏం తీసుకుంటే బాగుంటుంది అనేవి ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడ చెప్పే కొన్ని చిన్న చిట్కాలు వాడితే ఆ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ఏ వాహనంలో ఎక్కినా వాంతు సమస్య ఉన్న వ్యక్తి ముందు సీట్లో కూర్చొవడానికి ట్రై చేయాలి. దీంతో ఆ ఆలోచన నుంచి బయటపడి.. బయట వైపు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక మన పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం వల్ల కూడా ఈ సమస్య ఉన్నవారు తప్పించుకోవచ్చు.
పుస్తకాలు చదవడం.. మొబైల్ ఫోన్ చూడటం వంటివి చేస్తుండాలి. ఇలా వర్కౌట్ కాకపోతే ప్రయాణ సమయంలో అల్లం తీసుకుంటే వాంతి అనేది రాదు. కొంతమందికి నిమ్మకాయ వాసన చూసినా వాంతులు అనేవి రావు. ఏదేమైనా ప్రయాణ సందర్భంలో మనకు వాంతు వస్తుందన్న భావన, ఆలోచన అనేది తీసుకురాకుండా ఉండాలి. ఇలా చేస్తే పైన చెప్పినవి కూడా పాటించాల్సిన అవసరం లేదు.




























