టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సంతూర్ యాడ్ లో నటించిన క్యూట్ బేబీ ఎవరో తెలుసా.?

0
554

ఎవరు, ఎప్పుడూ ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు.వాళ్ళు ఎంచుకున్న అవకాశాల వల్ల సింగిల్ నైట్ లో స్టార్ లైపోతారు. అందుకు ఉదాహరణగా ఈమధ్యనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సంతూర్ ప్రకటన కోసం చెప్పవచ్చు.

‘హే మన సినిమాకు హీరోయిన్ దొరికేసింది.. కాలేజ్ స్టూడెంట్. వెంటనే మహేష్ బాబు మీరు మా సినిమాలో అని ఏదో అడగబోతుంటాడు. అక్కడనుంచి..మమ్మీ అంటూ ఓ పాప పరిగెత్తుతూ వస్తుంది.’ అదేనండి సంతూర్ సోప్ యాడ్ గురించే చెప్పేది. ఆ ఒక్క యాడ్‌తోనే క్యూట్ గా అందరినీ అలరించి బాగా పాపులరైన ఆ చిన్నపాప పేరు నిత్యా మోయల్.

కోల్గెట్ యాడ్ లో నటించిన ఈ చిన్న పాప నిత్యా మోయల్ ఉన్నటుండి సోషల్ మీడియాలో బాగ ఫేమస్ అయిపోయింది. మీ పేస్టు లో ఉప్పుందా అంటూ పెద్ద పెద్ద స్టార్ లతో యాడ్స్ చేయించే కోల్గెట్ సంస్థ ఎందుకు చిన్న పిల్లలతో యాడ్ చేయాలని నిర్ణయించిందో తెలియదు గానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల, సోషల్ మీడియా పుణ్యం వల్ల వాళ్ళకి కావల్సిన దానికంటే ఎక్కువ ప్రచారమే లభించిందని చెప్పాలి. మహారాష్ట్ర లోని ముంబైలో జులై 18న జన్మించిన నిత్యా మోయల్ ఒకప్రక్క చదువుకుంటూనే మరోప్రక్క సంతూర్ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే కాకుండా, తమిళ హీరో కార్తీతో, బాలీవుడ్ హీరో వరుణ్ దేవ్ తో కూడా సంతూర్ యాడ్స్ లోనూ, బ్రూక్ బ్యాండ్ యాడ్ లోనూ, షారూఖ్ ఖాన్ తో కల్సి ఓ యాడ్, సోనూసూద్ తో మరో యాడ్ లోనూ నిత్యా నటించింది. ఫియోనా వాయించడం, చెస్ ఆడడమంటే నిత్యాకు చాలా ఇష్టమంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here