హీరోయిన్ గౌతమీ వదిలేసిన మొదటి భర్త ఎవరో మీకు తెలుసా..? మనకి బాగా తెలిసిన వ్యక్తే..

0
4085

1968 వ సంవత్సరంలో జూలై 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జన్మించిన గౌతమీ తాడిమల్ల గీతం యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. తన పెదనాన్న కుమారుడు నిర్మించిన దయామయుడు సినిమాలో మొట్టమొదటిగా గౌతమి నటించారు. తదనంతరం తమిళ సినిమా పరిశ్రమలో అరంగేట్రం చేసి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. తెలుగులో కంటే తమిళంలోనే అగ్రతారగా దూసుకెళ్లిన హీరోయిన్ గౌతమి.. రేవతి, అమలా, భానుప్రియ వంటి హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచారు.

కేవలం సినిమాల్లో మాత్రమే కాదు సీరియల్లో కూడా ఆమె నటించారు. తమిళ ఛానెల్లో ప్రసారమైన ఇందిరా అనే ధారావాహిక లో ఆమె ప్రధాన పాత్రలో నటించారు. ఒక తమిళ టాక్ షో లో కాఫీ విత్ అను అని సన్ టీవీలో ప్రసారమైన ప్రోగ్రాంలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా అరంగేట్రం చేశారు. అప్పటికే ఆమె తన మొదటి భర్త అయినా సందీప్ భాటియాకి విడాకులు ఇచ్చేశారు.

హీరోయిన్ గౌతమి-సందీప్ జంట 1998వ సంవత్సరంలో పెళ్లి చేసుకొని 1999వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 2000వ సంవత్సరంలో కమల్ హాసన్ కి దగ్గరైన హీరోయిన్ గౌతమి అతనితో తర్వాత కాలంలో లివింగ్ ఇన్ రిలేషన్ షిప్ కొనసాగించారు. 2004 నుండి 2016 సంవత్సరం వరకు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం సాగించారు. ఐతే ఈ 12 సంవత్సరాల సమయంలో వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కొన్నాళ్ల తర్వాత తనని కమలహాసన్ ఆర్థికంగా, శారీరకంగా బాగా వాడుకున్నాడని… తనకి రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందట కంటతడి పెట్టుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన వాక్యాలు భారత దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

ఇకపోతే హీరోయిన్ గౌతమి పెళ్లి చేసుకున్న మొదటి భర్త భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్ కాగా… ఇతను ప్రతిరోజు బుల్లితెరపై కనిపిస్తూనే ఉంటారు. అలా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఫైనాన్షియల్ అనలిస్ట్ ని వదిలేసి హీరో వెనకాల పడి చివరికి ఒంటరిగా మిగిలిపోయారు హీరోయిన్ గౌతమి. 1999వ సంవత్సరంలో సుబ్బలక్ష్మి అనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన గౌతమి ఇప్పుడు ఆమె కోసమే జీవిస్తున్నానని అని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here