‘అన్నవరం’ చిత్రంలోని పవర్ స్టార్ చెల్లెలు ఇప్పుడేం చేస్తుందో తెలుసా.?!

0
341

కోలీవుడ్ డబ్బింగ్ చిత్రం ‘ప్రేమిస్తే’ టాలీవుడ్ లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ‘ప్రేమిస్తే’ చిత్రం కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కావటంతో తెలుగులోకి డబ్ చేసారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ అసిస్టెంట్ బాలాజీ శక్తివేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలాజీ శక్తి వెల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడు చెప్పిన నిజమైన ప్రేమ కథను విని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం కోసం ఓ పల్లెటూరి అమ్మాయి కావాలని డైరెక్టర్ వెతికి వెతికి చివరకు సంధ్యను ఎంపిక చేసుకున్నారు.

ఆ విధంగా 2004లో విడుదలైన ‘ప్రేమిస్తే’ సినిమా ద్వారా సంధ్య హీరోయిన్ ఆ తర్వాత తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడంతో కలిపి సుమారు 40 చిత్రాల్లో నటించింది.  తెలుగులో ‘అన్నవరం’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలుగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక అసలు విషయానికి వస్తే.. గత సంవత్సరంలో సంధ్య ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్ర శేఖరన్ను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గానే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ., అప్పడు చెన్నైలో సునామీని తలపించే వర్షాల కారణంగా.. పెళ్లి వేదికను మార్చుకుని కేరళలోని ప్రముఖ గురు వాయూర్ దేవాలయంలో  2015 డిసెంబర్ 6న చాలా సింపుల్ గా వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత సంధ్య సినిమా రంగానికి దూరంగానే ఉంది. అయితే తాజాగా సంధ్య కూడా ఓ చిన్నారికి జన్మనిచ్చింది. సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె సహ నటి, సంధ్య బెస్ట్ ఫ్రెండ్ సుజ వరుణీ తన ట్విట్టర్లో ట్వీట్ చేసింది. బుజ్జి పాపాయితో పాటు సంధ్య దంపతులతో తాను దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. కాగా పాప పుట్టిన తేదీపై క్లారిటీ లేదు. ప్రస్తుతం నటి సంధ్య తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివాసముంటుంది. ఇదిలా ఉండగా సంధ్య మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే రూమర్స్ ఆమధ్య సోషల్ మీడియాలో షికారు చేశాయి. లేటెస్ట్ గా ఆ రూమర్స్ ను నిజం చేస్తూ.. ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ అక్క పాత్రకు సంధ్య ఓకే చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here