సినీ రంగంలో హీరోయిన్ల రెమ్యునరేషన్ ల వివరాలు తెలుసుకుని ఆశ్చర్య పోవడం సహజం. ఎందుకంటే.. ఒక్కో చిత్రానికి కోటి నుంచి రూ.10 కోట్లు తీసుకునే అందాల తారలు తెలుగు సినిమా రంగంలో ఉన్నారు. ఒక్క పాటకు కోటి రూపాయలు తీసుకునే హాట్ గర్ల్స్ కూడా మన టాలీవుడ్‌లోనే ఉన్నారు. మరి బుల్లితెర విషయానికొస్తే.. సీరియ‌ల్స్.. సినిమాలను మించిన మంచి బిజినెస్.

స్క్రీన్ పై నవరసాలను ఆవలీలగా ఆరబోసే ప‌ట్టుంటే చాలు ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ లే లాంగిచేయొచ్చు. అది కూడా లో బ‌డ్జెట్ లో.. ఇందుకు ఉదాహరణగా మన తెలుగు బుల్లితెర సీరియల్స్ మొగ‌లి రేకులు, కార్తీక దీపాలు నే చెప్పవచ్చు. సినిమా తార‌ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా సీరియ‌ల్ న‌టీనటుల‌కు రెమ్యున‌రేష‌న్స్ ద‌క్కుతున్నాయి. వాళ్ళకీ.. సినిమాలో నటించే తారలకూ తేడా ఏమిటంటే.. సీరియల్స్ నటీమణులకు ఒన్ డే కాల్షీట్ లెక్క‌న రెమ్యున‌రేష‌న్ ఉంటుంది.! మరి ఈ లెక్కన ఏ సీరియల్ నటి ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో మీరే చదవండి..

ప్రేమి విశ్వనాధ్

ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ గురించి మాట్లాడాలంటే మొదటిస్ధానంలో నిలిచేది ‘కార్తీక‌దీపం’ సీరియల్ అనే చెప్పాలి. వంట‌ల‌క్క పేరు చెప్తే చాలు మహిళలు వంట చేయడం మానేస్తారు. అలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న ఈ సీరియల్ నటి అస‌లు పేరు ప్రేమి విశ్వనాధ్. సీరియ‌ల్ లో దీప పాత్రలో నటిస్తున్నందుకు ఈమె రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ. 25,౦౦౦

సుహాసిని

‘చంటిగాడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సుహాసిని త‌ర్వాత సీరియ‌ల్స్ లో సెటిలైపోయింది. ‘అపరంజి’ సీరియల్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ సీరియ‌ల్ లో నటిస్తున్నందుకు ఈమె రోజుకు తీసుకునే రెమ్యున‌రేష‌న్ అక్షరాల రూ.20,000.

ఐశ్వర్య

‘అగ్నిసాక్షి’ సీరియల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య ఒక రోజు రెమ్యునరేషన్ అక్షరాల రూ. 20,000

నవ్యస్వామి

‘నా పేరు మీనాక్షి’ సీరియల్ ద్వారా పరిచయమైన నవ్య స్వామి ప్రస్తుతం ‘ఆమెకథ’ సీరియల్లో నటిస్తుంది. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు గానూ నవ్య ఒక రోజుకి అందుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ.20,000.

పల్లవి రామిశెట్టి 

బుల్లితెర అనుష్క‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప‌ల్ల‌వికి ‘ఆడ‌దే ఆధారం’ సీరియల్ బ్రేక్ ఇచ్చింది. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు పల్లవి ఫర్ డే రెమ్యున‌రేష‌న్ అక్షరాల రూ.15,000.

అషికా

‘కథలో రాజకుమారి’ సీరియల్లో అవని పాత్ర పోషించిన అషికా రోజువారి రెమ్యునరేషన్ అక్షరాల రూ. 12,000 .

హరిత

‘వైదేహీ’ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన హరిత ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం కుంకుమ పువ్వు, ముద్ద మందారం లాంటి టాప్ సీరియల్స్ లో నటిస్తున్న హరిత ఒక రోజుకి తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ. 12,000.

సమీరా షరీఫ్

కొన్ని రోజులు ‘అదిరింది’ షోకి యాంక‌ర్ గా చేసిన స‌మీరా.. సీరియ‌ల్స్ లో కూడా నటిస్తుంటుంది. ఇందుకు గానూ ఈమె రోజుకు తీసుకునే రెమ్యున‌రేష‌న్ అక్షరాల పదివేల రూపాయలు.

ప్రీతినిగమ్

అటు సినిమాలు, ఇటు సీరియ‌ల్స్.. ఎటు ఛాన్స్ వ‌స్తే అటు.. ఈవిధంగా బుల్లితెర మరియు వెండితెరపై కూడా కనిపిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ప్రీతి నిగమ్ రోజువారి రెమ్యూన‌రేష‌న్ అక్షరాల రూ. 10,000.

మంజుల

‘చంద్రముఖి’ సీరియల్ ద్వారా త‌న కెరీర్ ను ప్రారంభించిన మంజుల, ఆ సీరియ‌ల్ లో త‌న‌తో కో యాక్ట‌ర్ గా న‌టించిన నిరుపమ్ ని పెళ్లి చేసుకుని బుల్లితెర‌కు కొన్ని రోజులు బైబై చెప్పేసింది. కొంతకాలం త‌ర్వాత ‘క్రిష్ణవేణి’ సీరియ‌ల్ తో సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఈమె రెమ్యునరేషన్ రోజుకు అక్షరాల రూ.8000.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here