తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. దీనికి నేటితో తెర పడనుంది. ప్రతీ ఒక్కరూ ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే అంతకముందు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్టులతో మాజీ కంటెస్టెంట్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ల నుంచి నాలుగో సీజన్ కంటెస్టెంట్ల వరకు ఎనిమిది మంది హౌస్ లో ఉన్న వాళ్లతో మాట్లాడారు.

అన్ అఫిషియల్ గా శనివారం అర్థరాత్రే ఫైనల్ షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్లలో సిరి, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముక్, సన్నీలల్లోల ముందుగా వీక్ గా ఉన్న సిరి ఎలిమినేట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ వెబ్ సైట్లు, యూట్యూబ్ సైట్లలోని పోలింగ్ లో కూడా సిరికి అతి తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి.
దీంతో హౌస్ నుంచి బయటకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. తర్వాత స్టేజ్ పైకి వచ్చి.. షణ్ముఖ్ గెలుపు కోసం తాను వెయిట్ చేస్తున్నానని.. బయటకు వచ్చి.. హౌస్ లో ఉన్నవాళ్లతో ముచ్చటించింది. సిరి ఎలిమినేట్ తర్వాత హౌస్ లో ఇక నలుగురు ఉన్నారు. అందులో కూడా అందరూ అబ్బాయిలే ఉండటం విశేషం. ఇక తర్వాత టాప్ 5 నుంచి టాప్ 4 కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.
అదే మానస్. నాగార్జున తనదైన శైలిలో ఇంటి నుంచి బయటకు పంపాడు. మానస్ ఎలిమినేషన్ తన ఫ్రెండ్ సన్నీకి షాక్ ను గురిచేసింది. ఇక తెలిసిన సమాచారం ప్రకారం వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వగా.. హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలిపోయారు. అందులో కూడా ఎవరు విన్ అవుతారనేది వాళ్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు కనిపిస్తోంది. విన్నర్ ఎవరనేది ఈ రోజు జరిగే ఎపిసోడ్లో తెలవనున్నది.































