ప్రపంచ ధనికులలో ఒకరిగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడుగా ఎంతో పేరున్న బిల్ గేట్స్ దంపతులు ఇన్ని సంవత్సరాల తర్వాత తన వైవాహిక జీవితం నుంచి విడిపోవడానికి సిద్ధమయ్యారు.ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత బిల్ గేట్స్ దంపతులు విడిపోవాలనే నిర్ణయం బిల్ గేట్స్ సతీమణిమిలిందా గేట్స్‌ దా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. తను ఈ వైవాహిక జీవితం నుంచి విడిపోవడానికి 2019 వ సంవత్సరంలోనే విడాకుల కోసం న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

మిలిందా గేట్స్‌ బిల్ గేట్స్ నుంచి విడిపోవడానికి గల కారణం బిల్ గేట్స్ కి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధమే ప్రస్తుతం వీరిద్దరి మధ్య విడాకులకు కారణమయ్యాయని చెప్పవచ్చు.ఎప్‌స్టీన్‌ మైనర్ బాలికపై వేధింపులు, మహిళల అక్రమ రవాణా వంటి కేసులలో నిందితుడు. ఇలాంటి కేసులలో అతనికి శిక్ష పడి జైలుకు వెళ్లాడు. 2019 వ సంవత్సరంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌ జైలులోనే మరణించారు.

ఈ విధంగా లైంగిక వేధింపుల ఆరోపణల్లో శిక్ష పడిన వ్యక్తితో బిల్ గేట్స్ సన్నిహితంగా ఉండటం మిలిందా గేట్స్‌ కి నచ్చలేదు. అతనిని తరచు కలవడం పై మిలిందా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆధ్యాత్మిక విషయాలను గురించి మాత్రమే తనతో చర్చిస్తున్నానని బిల్ గేట్స్ చెప్పినప్పటికీ 2013 నుంచి బిల్ గేట్స్ తరచు తనని కలిసేవారు. అదే విధంగా ఒకరోజు రాత్రి మొత్తం ఎప్‌స్టీన్‌ ఇంటిలోనే బిల్ గేట్స్ గడపడంతో మిలిందా గేట్స్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here