మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రం ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ డివోషనల్ డ్రామా రిలీజ్ కాగానే మంచి టాక్‌ను సంపాదించింది. సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా, ప్రభాస్ రుద్రుడిగా కనిపించిన అరగంట సీన్స్ సినిమాలో హైలెట్‌గా నిలిచాయి.

భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మంచు మోహన్ బాబు, విష్ణు కలసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాను మరింత గ్రాండ్ చేశాయి. రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మంచి విజయం దిశగా దూసుకెళ్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమా ప్రారంభ దశలో రుద్ర పాత్రకు దర్శకుడు మరియు నిర్మాతలు మొదటిగా ఎన్టీఆర్ ను అనుకున్నారట. విష్ణు కూడా మొదట ఎన్టీఆర్‌కే ఆ పాత్రను ప్రతిపాదించారట. అయితే అప్పట్లో ఎన్టీఆర్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో లేదా ఇంకొన్ని కారణాలతో వారు ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గారు.
ఈ సమయంలో మోహన్ బాబు సహా పలువురు సన్నిహితులు విష్ణుకు ప్రభాస్ పేరును సూచించారని తెలుస్తోంది. దీంతో విష్ణు స్వయంగా ప్రభాస్‌ను సంప్రదించి కథ వినిపించగా, ప్రభాస్ వెంటనే ఓకే చేశాడట. షూటింగ్ సమయంలో ప్రభాస్ ఎంతో డెడికేషన్‌తో పనిచేసినట్టు సమాచారం. ప్రేక్షకులకూ ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగా నచ్చాయి. ముఖ్యంగా విష్ణు-ప్రభాస్ మధ్య సీన్లపై థియేటర్లలో సందడి నెలకొంది.
అంతేకాదు, కేవలం అరగంట మాత్రమే స్క్రీన్ పై కనిపించినా ప్రభాస్ రుద్ర పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రివ్యూలలో కూడా ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రుద్ర పాత్రకు ముందు ఎన్టీఆర్‌ను అనుకోవడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అభిమానులు మాత్రం “ప్రభాస్ వేశారు.. కేరక్టర్‌కి సూటయ్యారు” అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ‘కన్నప్ప’ సినిమా కేవలం మంచు ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, ప్రభాస్ అభిమానులకు కూడా మంచి వినోదాన్ని, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. రుద్రుడిగా ప్రభాస్, భక్త కన్నప్పగా విష్ణు కలిసి ప్రేక్షకులకు ఒక మాగ్నిఫిసెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చారు అనే చెప్పాలి.




























