శియా గౌతమ్ గుర్తుందా..? 2008లో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘నేనింతే’. సినిమా రంగంలోని కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ సరసన శియా గౌతమ్ హీరోయిన్ గా నటించింది.

గతంలో పూరి జగన్నాథ్ పరిచయం చేసిన అందరి హీరోయిన్ల లాగే శియా కూడా పెద్ద రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ తన తొలిచిత్రమే ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు అడియాశలు గానే మిగిలి పోయాయి. ఆ తర్వాత ‘వేదం’ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన శియ ఈమధ్య ‘ఏడు ప్రేమకథలు’ లాంటి చిన్న చిత్రాలలో నటించి అవీ ఆశించినంత విజయం సాధించక పోవడంతో తెర మరుగై పోయింది శియా. శియాను టాలీవుడ్ ప్రేక్షకులందరూ పూర్తిగా మరిచిపోతున్న సమయంలో ఆమెకు బాలీవుడ్లో ఒక బంపరాఫర్ రావడం వచ్చింది. ఆ ఆఫర్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శియా. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్‌ను తెరకెక్కిస్తూ.. రాజ్ కుమార్ హీరాణి నిర్మించిన ‘సంజు’ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో రణభీర్ కపూర్ నటించాడు. ఈ చిత్రంలోనే సంజయ్ దత్ సోదరి ప్రియాంక దత్ పాత్రలో శియా గౌతమ్ నటించింది.

ఆ మూవీలో తన అందం అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ మూవీ కూడా హిట్ అయింది. కానీ సియాకు మాత్రం మంచి అవకాశాలు రాలేదు. దాంతో శియా నాటి నుండి నేటి వరకూ వెండితెరపై కనిపించలేదు. అసలు ఇప్పుడెలా ఉందో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియదు. ఇదే అంశంపై ఆరా తీయగా నటి శియా కోసం ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. శియా అసలు పేరు అతిథి గౌతమ్. ఆమెకి ఒక అన్నయ్య ఉన్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి శియా ముంబైలోనే ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన డైలీ ఆక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటోంది సియా.!



























