Nandamuri Kalyan Ram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే బాలకృష్ణ తర్వాత ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ అదే స్థాయిలో గుర్తింపు పొందారు. ఇకపోతే ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక కళ్యాణ్ రామ్ పలు సినిమాలలో నటించినప్పటికీ నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఇక పోతే ఈయన తాజాగా బింబిసార అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ నిజంగానే హిట్ కొట్టేలా ఉన్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఎక్కువగా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేయరు. తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఓకే ఫ్రేమ్ లో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ…
కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి, కుమారుడు సౌర్య రామ్, కూతురు తారక అద్వితలు కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా నందమూరి ఫ్యామిలీ ని ఒకే ప్రేమలో చూడటంతో అభిమానుల సైతం ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు































