సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో విడుదలైన ప్రేమ్ నగర్ సినిమా తో దగ్గుబాటి రామానాయుడు అక్కినేని నాగేశ్వరరావుల మధ్య స్నేహ బంధం మరింత పెరిగిందని చెప్పవచ్చు. అది ఒక దశలో ఎక్కడికి వెళ్ళింది అంటే నాగేశ్వర రావు కొడుకు నాగార్జున రామానాయుడు కూతురు లక్ష్మీ ల వివాహం వరకు వెళ్ళింది.ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం గా చెప్పవచ్చు.

అయితే నాగార్జున, లక్ష్మీ ల వివాహానికి దాదాపు రెండు నెలల ముందు వీరి వివాహము అంగరంగ వైభవంగా జరిపించాలని అటు దగ్గుబాటి ఇటు అక్కినేని కుటుంబాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆ క్రమంలో తెలుగు తమిళ కన్నడ హిందీ సినీ ప్రముఖులు హాజరవుతారు అన్న ఉద్దేశంతో ఒక పెద్ద మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కావాలని రామానాయుడు నాగేశ్వరరావు ఇద్దరూ మద్రాసులో ఎంత ప్రయత్నం చేసినా వీరికి ఒక మంచి ఫంక్షన్ హాల్ దొరకలేదు. ఆ క్రమంలో బి.నాగిరెడ్డిని కలిసినప్పుడు మీరు పెళ్లి పనులు చూసుకోండి.నేను మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ను చూసి పెడతాని బి.నాగిరెడ్డి అన్నారు.

సరిగ్గా యాభై నాలుగు రోజుల్లో అంటే పెళ్లికి ఆరు రోజుల ముందు బి.నాగిరెడ్డి తన విజయ గార్డెన్స్ లో విజయ శేష్ మహల్ నిర్మించి అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ ల వివాహానికి సిద్ధం చేశారు. కేవలం 54 రోజుల్లో బి.నాగిరెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మించి ఇవ్వడం నాగేశ్వర రావు రామానాయుడు లను ఆశ్చర్యానికి గురి చేసింది. అలా నాగార్జున సినిమాల్లోకి రాకముందే దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీ తో 1984 ఫిబ్రవరి లో వివాహం జరిగింది.

అనివార్య కారణాల వలన నాగార్జున, లక్ష్మీ 1990లో డైవర్స్ తీసుకోవడం జరిగింది. నాగార్జున తో చాలా సినిమాల్లో నటించిన అమలతో 1992లో నాగార్జునకు వివాహమైంది. వీరి వివాహానికి గుర్తుగా 1994లో అఖిల్ జన్మించారు. నాగార్జున డైవర్స్ అనంతరం లక్ష్మి కూడా శరత్ అనే ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. శరత్ కూడా లక్ష్మీ తో రెండో వివాహమే, శరత్ మొదటి భార్య కొడుకు మరియు నాగ చైతన్య కలిసి పెరగడం జరిగింది. శరత్ కొడుకు ప్రేమ వివాహానికి నాగ చైతన్య ఇటీవల కాలంలో హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here