Doctor Samaram : ప్రముఖ వైద్యులు సమరం అంటే ఎవరో తెలియని తెలుగు వారు ఉండరు. ఆయన తన వైద్య వృత్తితోనే కాకుండా రచయిత, సమాజ సేవ ద్వారా కూడా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. సమరం గారు పుట్టింది మచిలీపట్నం, ఆయన ఒక నాస్తిక వాది. ఆయన తండ్రి ప్రముఖ నాస్తికవాది అయిన గోరా. ఆయన సిధాంతాలను ఈయన ఒంటపట్టించుకుని అనేక గ్రామాలు, తెలంగాణలోని అనేక పల్లెల్లో బాణామతి, చేతబడి వంటి మూఢ నమ్మకాలను తొలగించడానికి అలాగే అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను చేశారు. వైద్య వృత్తిలో యాభై ఏళ్లకు పైనే ఉన్న సమరం గారు అయన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే…
సమరం గారు వైద్య వృత్తిలో ఉంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు. అయితే ఆ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భార్యకు వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కానుక ఆ స్థలం అని, అందులో హాస్పిటల్ కట్టడానికి బ్యాంకు లోన్ తీసుకుని యాభై ఏళ్ళు లోన్ ద్వారా కొంచెం కొంచెంగా హాస్పిటల్ ను నిర్మించామని చెప్పారు. ఆయన అక్క కూతరునే పెళ్లి చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం కోట్లలో ఉన్న ఆ హాస్పిటల్ విలువ అప్పట్లో స్థలం గజం 7 రూపాయలు మాత్రమే అంటూ తెలిపారు. ఇక తాను సంపాదించిన ఆస్తి కంటే సంపాదించుకున్న అభిమానులే నాకు గొప్ప ఆస్తి అంటూ చెప్పారు. ఎక్కడికి వెళ్లినా గుర్తుపడతారని, పాఠశాలలకు వెళ్ళినపుడు స్వాత్రంత్ర సమరయోధులను అడుగగా పిల్లలు చెప్పలేక పోయారు కానీ నా పేరు చెప్పగానే తెలుసని చేతులెత్తారు అంతకంటే ఏమి కావాలి అంటూ చెప్పారు.



























