Dooradarshan VijayaDurga : దూరదర్శన్ తెలుగు భాషలో మొదలైన తొలినాళ్ళలో వ్యాఖ్యాతగా యాంకర్గా ఎన్నో కార్యక్రమాలను అలాగే ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి తొలితరం మహిళా యాంకర్ గా గుర్తింపు పొందిన వ్యక్తి విజయదుర్గ గారు. ఆమె దూరదర్శన్ లో పనిచేసే సమయంలో ఆమె కట్టు, బొట్ట, ఉచ్చారణ వంటి వాటి కంటే తాను చేస్తున్న ప్రోగ్రాంలో కంటెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. విజయవాడకు చెందిన విజయ దుర్గ గారు ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు, అచీవ్మెంట్స్ సొంతం చేసుకున్నారు. తాజాగా మొదటి సారి ఆమె యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సావిత్రి గారే నా హీరో…
విజయ దుర్గ గారు తన వ్యక్తిగత విషయాలను గురించి చెబుతూ హిందీలో రాజేష్ కన్నా గారంటే హీరోలలో చాలా ఇష్టమని చెప్పారు. ఇక తెలుగులో హీరోలెవరూ లేరని కేవలం సావిత్రి గారే హీరో హీరోయిన్ అన్నీ అంటూ చెప్పారు. ఆమెను వ్యక్తిగతంగా చూసాక మరింత నచ్చారంటూ చెప్పారు. తన గురించి తానే స్వయంగా చూసినవి కొన్నయితే సావిత్రి గారికి దగ్గరగా ఉన్న చాలా మంది ద్వారా తెలిసినవి మరికొన్ని అంటూ చెప్పారు. బయట ప్రపంచానికి తెలియని సావిత్రి గారి విషయలు ఎన్నో ఉన్నాయంటూ చెప్పారు.

తాను సావిత్రి గారి గురించి తనకు తెలిసిన విషయాలను ఫేస్ బుక్ ద్వారా ‘సావిత్రి గురించి మీకు తెలియని 10 విషయాలు’ అనే కథలను రాశానని చెప్పారు. ‘మహానటి’ సినిమా చూసానని అయితే ఆ సినిమాలో చూపించిన వాటిలో అన్నీ నిజాలు కావంటూ చెప్పారు. సినిమా అన్నాక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి అలా తీసారని, అందులో చూపించని సావిత్రి ఇంకా చాలా ఉందని, అలాంటి మనిషి మరొకరు లేరంటూ చెప్పారు.


































