మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. కొందరు ఉదయం, సాయంత్రం టీ తాగితే మరి కొందరు ఒక పూట మాత్రమే టీ తాగుతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగితే ఆ మజానే వేరు. టీ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ మధ్య కాలంలో ప్రజలు మిగతా టీలతో పోలిస్తే గ్రీన్ టీ వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే గ్రీన్ టీ తాగే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గుండెపోటు, హృదయ సంబంధిత సమస్యలను గ్రీన్ టీ తగ్గిస్తుంది. వారంలో కనీసం మూడుసార్లు గ్రీన్ టీ తాగితే గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఇష్టానుసారం గ్రీన్ టీని తాగితే మాత్రం ప్రమాదంలో పడ్డట్టేనని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని సమయాల్లో గ్రీన్ టీని తీసుకుంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే పోషకాహార సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. మనం కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్లను టీతో కలిపి వేసుకుంటూ ఉంటాం. అయితే గ్రీన్ టీతో ట్యాబ్లెట్లను వేసుకుంటే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయి.
గ్రీన్ టీలో ఉండే కెమికల్స్ అసిడిటీ సమస్యలకు కారణమవుతాయి కాబట్టి గ్రీన్ టీతో ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. ఉదయం సమయంలో మాత్రం టిఫిన్ తరువాత గ్రీన్ టీ తాగితే మంచిది. ఉదయాం లేచిన వెంటనే గ్రీన్ టీ తాగితే తీవ్ర ఆరోగ్య్ సమస్యలను ఎదుర్కోక తప్పదు. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది కాబట్టి నిద్రపోయే సమయంలో గ్రీన్ టీ తీసుకోకపోవడమే ఉత్తమం.


























