భూమి మీద మనకు లభించే ముఖ్యమైన వస్తువులలో నీరు కూడా ఒకటి. నీరు మనిషికి జీవనాధారం. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి రోజు ఖచ్చితంగా నీరు త్రాగాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గోరువెచ్చని నీరు ప్రతిరోజూ ముఖ్యంగా నిద్రపోయేముందు తాగితే అనేక లాభాలున్నాయి. అవి ఏమిటంటే..

- మొదటగా మానసిక ప్రశాంతత కలుగుతుంది.
- ఒత్తిడి, డిప్రెషన్ మరియూ మానసిక ఆందోళనలు తగ్గించేందుకు దోహదం చేస్తుంది.
- దీనితో హాయిగా నిద్ర పడుతుంది.
- అదే క్రమంలో శరీరంలోని వ్యర్ధ పదార్దాలు బయటకి వెళ్ళిపోతాయి.
- శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.
- అంతే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
- అజీర్తి సమస్యని దూరం చేస్తుంది.
- ముఖ్యంగా అధిక బరువును త్వరగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.