రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో డ్రోన్ చలనం కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో జైలు పైభాగంలో డ్రోన్లు ఎగురుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జైలు అధికారులు నిన్న రాత్రి ఎస్పీ నరసింహ కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

మిథున్ రెడ్డిపై రెక్కీ అనుమానాలు
ప్రాథమిక దర్యాప్తులో, సమీపంలోని ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రోన్లు ఎగురుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ప్రాధాన్యం పెరగడానికి కారణం, ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటమే. దీనితో, తమ నేతపై ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల విచారణ కొనసాగుతోంది
ప్రస్తుతం పోలీసులు డ్రోన్ ఎగరేసింది ఎవరు? దాని ఉద్దేశ్యం ఏమిటి? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిజనిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



























