యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్‌ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విశ్వక్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా కనిపించింది. రొమాంటిక్ టచ్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రూపొందింది.

‘జాతిరత్నాలు’, ‘ప్రిన్స్’ వంటి చిత్రాలతో తనదైన కామెడీ స్టైల్‌ను నిరూపించుకున్న దర్శకుడు అనుదీప్ కెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తన ప్రత్యేక హాస్య శైలితో ప్రేక్షకులను అలరించిన అనుదీప్, ఈసారి విశ్వక్ సేన్‌తో కలిసి మరో వినోదాత్మక ప్రయోగం చేశాడు. ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుంచే సినిమా మీద అంచనాలు పెరిగాయి.
ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, తొలి స్పందనలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. క్రిటిక్స్‌తో పాటు నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నారు. కొందరు ప్రేక్షకులు సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయని చెబుతుంటే, మరికొందరు సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ టచ్ బాగుందని అభిప్రాయపడుతున్నారు.
Just settled in and about to start #Funky, where the trailer already said: "Bring your sense of humour, leave your logic at the door."
— Desi Reviewer (@desireviewer10) February 13, 2026
Challenge accepted. Let's see what kind of wild ride tonight brings. Ready for some madness, laughs, and full-on entertainment! pic.twitter.com/gL3nQVv8Rd
విశ్వక్ సేన్ తన ఎనర్జీ, టైమింగ్‌తో సినిమాను మోసుకెళ్లాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కయాదు లోహర్ గ్లామర్‌తో పాటు నటన కూడా ఆకట్టుకుందని ప్రేక్షకుల అభిప్రాయం. అనుదీప్ స్టైల్‌లో వచ్చే సిల్లీ కామెడీ, సడెన్ పంచ్ డైలాగ్స్ కొన్ని చోట్ల థియేటర్లలో నవ్వులు పూయించాయని రివ్యూలలో పేర్కొంటున్నారు.
#funky Inka ippatlo led annunta comeback @VishwakSenActor below average 1st half
— SID (@siddu1899) February 13, 2026
అయితే కొంతమంది నెటిజన్లు కథ పరంగా పెద్దగా కొత్తదనం లేదని, కానీ ఎంటర్టైన్‌మెంట్ కోసం చూస్తే ఓకే మూవీ అని చెబుతున్నారు. మొత్తంగా ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ మిక్స్‌డ్ టు పాజిటివ్‌గా కనిపిస్తోంది.
#funky Inka ippatlo led annunta comeback @VishwakSenActor below average 1st half
— SID (@siddu1899) February 13, 2026
వాలెంటైన్ వీక్‌లో రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. విశ్వక్ సేన్‌కు ఇది మరో కమర్షియల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది వచ్చే రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.
#Funky Below Par 1st Half!
— Venky Reviews (@venkyreviews) February 13, 2026
Typical Anudeep style one-liner comedy. A few jokes work, but most fall flat and feel overly silly. Choppy editing makes the narration feel like a compilation of comedy scenes without an organic flow.



























