Dubbing Artists Savitha Reddy: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను తెలుగు వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని హీరోయిన్లుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇతర రాష్ట్రాల వారికి తెలుగు మాట్లాడటం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే తెలుగు రాని హీరోయిన్స్ కేవలం సినిమాలలో నటించిన తర్వాత ఆ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెబుతూ ఉంటారు.

ఈ విధంగా హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాలంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి. తప్పకుండా ఆ సన్నివేశంలో వారి లిప్ మూమెంట్ ఆధారంగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సబితారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె త్రిష, కాజల్, రాశి ఖన్నా వంటి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సవిత మాట్లాడుతూ..ఒక సన్నివేశంలో హీరోయిన్ లిప్ మూమెంట్ సింక్ అయ్యేలా డైలాగ్ చెప్పడం అంటే చాలా కష్టమైన పని అని తెలిపారు. తమకు ముందుగా ఆ సన్నివేశాలకు సంబంధించిన స్క్రిప్ట్ ఇవ్వరని అప్పటికప్పుడు ఒకసారి రిహార్సల్స్ చేసి టేక్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇకపోతే హీరోయిన్ పాత్రలకు అనుగుణంగా మనం కూడా డబ్బింగ్ చెప్పేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని సవిత తెలియజేశారు.
హీరోయిన్లకు తెలుగు రాకపోవడంతో ఇబ్బంది…
ఇకపోతే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు తెలుగు రాదు. వాళ్ళు ఆ సన్నివేశంలో నటించేటప్పుడు ఏదో తుతుతు అంటారు.సన్నివేశాన్ని మార్చలేము కనుక డబ్బింగ్ చెప్పేటప్పుడు వారి లిప్ మూమెంట్ ఆధారంగా మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని, అయితే హీరోయిన్స్ భాష నేర్చుకొని ఉంటే డబ్బింగ్ చెప్పడం చాలా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా డబ్బింగ్ కష్టాల గురించి సవిత తెలియజేశారు.































