Dubbing Janaki : తెలుగులో ఎన్నో సినిమాలలో నటించినా డబ్బింగ్ ఎక్కువగా చెప్పడం వల్ల ఆపేరునే ఇంటి పేరుగా మార్చుకుని డబ్బింగ్ జానకిగా ప్రసిద్ధికెక్కిన దాసరి జానకి గారిది ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం. ఏడో తరగతి వరకు చదివిన జానకిగారు మిలిటరీలో పనిచేస్తున్న తన ఊరికే చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పారిపోయి పెళ్లి చేసుకున్న డబ్బింగ్ జానకి గారు చెన్నై కి వెళ్లి అక్కడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. నిజానికి నాటకరంగంతో బాగా పరిచయం ఉండటం వల్ల సినిమాల్లోను ప్రయత్నించారు జానకి. భర్త మిలిటరీలో పనిచేస్తూ ఉండటం వల్ల ఇద్దరు కొడుకులు కూతురు బాధ్యత ఎక్కువగా తానే చూసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో సీనియర్ నటులతో ఉన్న అనుబంధం ఒక్కొక్కరిగా పెద్ద ఆర్టిస్టులు మరణించడం గురించి బాధపడ్డారు.

చంద్రమోహన్ గారి ఇంట్లో ఎన్నో ఏళ్ళు ఉన్నాను…
డబ్బింగ్ జానకి గారికి ఆ తరం నటులు ఈ తరం నటులు చాలా మందితో నటించిన అనుభవం ఉంది. అప్పటి సీనియర్ ఆర్టిస్టులతో మంచి అనుబంధం ఉన్న జానకి గారు ఇటీవల టాలీవుడ్ లో సీనియర్స్ వరుసగా మరణించడం బాధించిందంటూ ఇండస్ట్రీ ఎటు వెళ్తోందో తెలియడం లేదంటూ మాట్లాడారు. ఇక అలనాటి డైరెక్టర్ విశ్వనాథ్ గారిని గత ఏడాది వెళ్లి కలిసి మాట్లాడానని ఎపుడైనా వెళ్లి సీనియర్స్ ను పాలకరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

చంద్రమోహన్ గారితో మంచి అనుబంధం ఉందని, చెన్నై లో చంద్రమోహన్ గారి ఫ్యామిలీ ఉన్నపుడు వాళ్ళ ఇంట్లోనే ఎన్నో ఏళ్ళు అద్దెకు ఉన్నట్లు చెప్పారు. చంద్రమోహన్ భార్య జలంధర గారితో మంచి అనుబంధం ఉందని వివరించారు. ఒకసారి వెళ్లి ఆయనను చూడాలని అనుకుంటున్నట్లు కాకపోతే వేరే వాళ్ళతో వెళితే ఫోటోలు, పిబ్లిసిటీ అంటూ హడావిడి చేస్తారు. నాకు అలాంటి పబ్లిసిటీ అవి నచ్చవు అందుకే నేనే వెళ్లి మాట్లాడి రావాలని అనుకుంటున్నాను అంటూ జానకి తెలిపారు.































