మొటిమలు రాకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలివే!

0
371

అందంగా కనిపించాలని ఎవరైతే అనుకోరు చెప్పండి.అలా అందంగా కనిపించడానికి మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఫేస్ క్రీములు, ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటిని వివిధ రకాల రసాయనాలతో తయారు చేయడం వల్ల కొందరు చర్మానికి పడక స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. చర్మ సమస్యలలో చాలా మందికి మొటిమలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ మొటిమల వల్ల అందవిహీనంగా కనిపించడమే కాకుండా ఎంతో ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మరి మొటిమలు రాకుండా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే….

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శరీర తత్త్వం ఉంటుంది. కొందరికి ఆయిల్ స్కిన్, మరికొందరికి డ్రై స్కిన్ ఉంటుంది.ఆయిల్ స్కిన్ ఉన్న వారిలో ఎక్కువగా ఈ మొటిమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఆయిల్ స్కిన్ ఉన్నవారు ప్రతిరోజు గోరువెచ్చటి నీటితో రెండు నుంచి మూడుసార్లు బాగా శుభ్రం చేసి మెత్తటి టవల్ తో శుభ్రపరుచుకోవాలి. రాత్రి పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేసే పడుకోవడం ద్వారా మొటిమలు రాకుండా కాపాడుతుంది.

రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా చెమట రూపంలో మన శరీరంలో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ బయటకి వెళ్లి మొహం ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తుంది. వీలైనంత వరకు రోజులో ఎక్కువ సార్లు నీటిని తీసుకోవడం వల్ల, నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, పండ్లు, ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

మొటిమలు రాకుండా, మన మొహం కాంతివంతంగా మెరవాలంటే 2 టేబుల్ స్పూన్లు శెనగపిండి, అర టీ స్పూన్ పసుపు, చిటికెడు కర్పూరం,చిటికెడు గంధం పొడిని తీసుకొని వీటన్నింటిని రోజ్ వాటర్ లో బాగా మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకొన్న తర్వాత పదిహేను నిమిషాలపాటు ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు రాకుండా, మన మొహం కాంతివంతంగా ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటించటం ద్వారా మొటిమల సమస్య నుంచి విముక్తి పొంది ఎంతో అందంగా తయారవుతారు.