మనలో చాలా మంది బరువు తగ్గడానికి, రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటానికి రన్నింగ్ చేస్తుంటాం. రన్నింగ్ చేయడం ద్వారా మన శరీరానికి సరైన శ్రమ దొరకడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యల బారినుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే రన్నింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి.

- రన్నింగ్ చేసేటప్పుడు మొట్టమొదటిది సరైన షూస్ ధరించాలి.
- షూస్ ధరించిన వెంటనే పరిగెత్తకూడదు. కనీసం 10 నిమిషాలు ఆగి పరిగెత్తాలి.
- రన్నింగ్ రెగ్యులర్ గా చేయకుండా వారంలో ఒకరోజు ఖచ్చితంగా సెలవు తీసుకోవాలి.
- ఎక్కువ వేగంగా పరిగెత్తకూడదు.
- వాక్-జాగ్ సీక్వెన్స్ ట్రై చేయాలి.
- ఆరోగ్యకరమైన పండ్లు, పదార్ధాలు తీసుకోవాలి.
- నీళ్ళు అధికంగా తాగుతూ రన్నింగ్ చేయకూడదు.
- రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోవాలి.
































