వేసవి వేడితో ఇళ్లన్నీ ఉడికిపోతున్నాయి. మధ్యతరగతి ఇళ్లలో ఏసీ, కూలర్లు లేనప్పుడు ఫ్యాన్ మాత్రమే ఉపశమనం ఇస్తాయి. అయితే, కొన్ని సులభమైన ట్రిక్స్ పాటిస్తే ఫ్యాన్‌ను చల్లటి గాలిని అందించే ఏసీలా మార్చవచ్చు.
ముందుగా, ఫ్యాన్ బ్లేడ్లను క్లీన్ చేయడం చాలా ముఖ్యం. దుమ్ముతో మురికి మిగిలితే గాలి వేగం తగ్గిపోతుంది. మోటార్ మీద కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల రెక్కలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం అవసరం.

ఫ్యాన్ డైరెక్షన్ మార్చడం కూడా ఫలవంతం. సాధారణంగా ఫ్యాన్లు క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్‌లో తిరుగుతాయి. వేసవి సీజన్లో యాంటీ క్లాక్ వైజ్‌లో తిరగడం వల్ల గాలి కిందకు వెళ్లి చల్లని అనుభూతిని ఇస్తుంది.
టేబుల్ ఫ్యాన్స్ కోసం ఐస్ బాటిల్ ట్రిక్ బాగుంటుంది. రెండు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నింపి ఫ్రిజ్‌లో ఉంచి మంచు కట్టిన తర్వాత, వాటిని ఫ్యాన్ వెనుక లేదా ముందు ఉంచండి. ఫ్యాన్ తిరుగుతుంటే మంచు కరిగి చల్లదనాన్ని గది అంతటా వ్యాప్తి చేస్తుంది.
క్రాస్ వెంటిలేషన్ కూడా కీలకం. రూమ్‌లో రెండు వైపులా కిటికీలు తెరిచి, ఒక కిటికీ వద్ద ఫ్యాన్ పెట్టి గాలి లోపలికి రావడం, మరో కిటికీ ద్వారా వేడి గాలి బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం మరొక కీలక మార్గం. వంటగది, బాత్రూమ్లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్లను సాయంత్రం వేళల్లో ఆన్ చేయడం వల్ల గది వేడి గాలి బయటకు వెళ్లి చల్లగా ఉంటుంది.
ఈ సులభమైన ట్రిక్స్ పాటించడంతో, వేసవి వేడి ఎక్కువగా బాధించకుండా ఫ్యాన్‌ను ఏసీలా ఉపయోగించవచ్చు.



























