బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అందరి సపోర్ట్ గంగవ్వకే.!

0
346

బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 4″ లో స్టార్ కటెస్టంట్ గంగవ్వ. ఆమె కోసం బిగ్ బాస్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొదటిరోజు షోలోని కంటెస్టెంట్స్ తో కలిసేందుకు కాస్త ఇబ్బంది పడిన గంగవ్వ ఇప్పుడు అందరిని కలుపుకుంటూ హుషారుగా పాల్గొంటుంది. “బిగ్ బాస్ హౌస్” సభ్యులు కూడా ఆమెకు బాగానే సపోర్ట్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో ఈ సీజన్ క్రేజీ కంటెస్టంట్ గా మారుతున్నారు గంగవ్వ. ఆల్రెడీ బయట ఆడియెన్స్ లో ఆమె మీద ఓ పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది.

ఇదిలాఉండగా లేటెస్ట్ గా బిగ్ బాస్ షోలో గంగవ్వ తన తోటి కంటెస్టెంట్స్ మీద వేసిన పంచులు బాగా పేలాయి. హౌజ్ మేట్స్ అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుతున్నసమయంలో ఆమెని కదిలిస్తే చాలు పంచులే పంచులు అన్నట్టు మాట్లాడుతుంది. హౌజ్ మేట్స్ ఒక్కొక్కరి గురించి తనదైన శైలిలో సూర్య కిరణ్ ని భూస్వామి అని.. అఖిల్ అర్ధరాత్రి కూడా అటు ఇటు తిరుగుతూ మంచిగా చూసుకుంటాడని, అలాగే మిగతావాళ్ళ గురించి కూడా క్రేజీగా చెప్పింది గంగవ్వ. ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు బిగ్ బాస్. మొన్న కూడా డంబెల్స్ తో ఎక్సర్ సైజ్ చేయడం.. బిగ్ బాస్ అంటూ కండలు చూపించడం లాంటివి ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గా అనిపిస్తున్నాయి.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గంగవ్వ తప్పకుండా సేవ్ అవుతుందని అందరు అంటున్నారు. ఆమెకు ఇబ్బంది లేనంతవరకు హౌజ్ లో ఉంచేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గంగవ్వకి అత్యధిక ఓట్లు వేసి ఆమెను సేఫ్ చేయాలని అనుకుంటున్నారు బుల్లితెర ఆడియెన్స్. ఈ వయసులో బిగ్ బాస్ హౌజ్ లోకి రావడమే ఆమె గెలుపని చెప్పుకోవచ్చు. అలాంటి ఆమెకు ఇప్పుడే ఎలిమినేషన్ ఏంటని బిగ్ బాస్ మీద ఆసక్తి లేనివాళ్లు కూడా ఆమెకు ఓటు వేస్తున్నారట. ప్రతివారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిపే క్రమంలో ఈసారి గంగవ్వకే ఎక్కువ ఓట్లు వస్తాయని అంటున్నారు. తప్పకుండా ఆమెను 5,6 వారాల పాటు కాపాడుతారని.. అలాగే ఏమో బిగ్ బాస్ ఈ సీజన్ విన్నర్ గా ఆమెను చేసినా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

విజేతగా ఏమో కాని బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5లో మాత్రం ఆమె ఉండే ఛాన్స్ ఉందని రకరకాలా కామెంట్స్ వినపడుతున్నాయి. . వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో 2 రోజులకే ఆడియెన్స్ లో ఆసక్తి మొదలైంది. కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా అన్ని ఓట్లు రావడం లేదు. కానీ గంగవ్వకి రావడంతో ఆమెపై అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ మిగతా కంటెస్టెంట్స్ కి కూడా అన్యాయం జరగకూడదు అని కొందరి ఫీలింగ్. మరి ఈ సెన్సిటివ్ లైన్ లో గంగవ్వ ట్రావెలింగ్ ఎలా నడుస్తుందో, ఈ సీజన్ లో ఎవరు ది బెస్ట్ గా నిలుస్తారో.. ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో వేచి చూడాలి.