Ex IPS Narasaiah : ఎన్టీఆర్ ప్రధానిమంత్రి అయ్యేవాడు… ఆయన తెచ్చిన పథకాలే అన్నీ… భారతరత్న ఎందుకు రాలేదంటే…: విశ్రాంత ఐపిఎస్ ఆఫీసర్ నరసయ్య

0
142

Ex IPS Narasaiah : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎంగా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకసలు రాజకీయం రాదంటూ అదే తెలుసుంటే ఆయన దేశానికి పీఎం అయ్యేవాడని తెలిపారు. ఆయన ఎంత భోలా మనిషో అలాగే తనతో ఉండేవాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వంటి విషయాలను ఇంటర్వ్యులో పంచుకున్నారు.

ఆయన అనుకుని ఉంటే ప్రధాని అయ్యేవాడు…

ఎన్టీఆర్ గారికి రాజకీయ అవగాహనా లేదు. కేవలం తనను సినిమాల ద్వారా ఇంత ఆదరించిన ప్రజలకు తన వంతుగా ఏదైనా మంచి చేయాలనే తపన ఉండేది అంటూ నరసయ్య గారు తెలిపారు. ఆయనను మొదట్లో మీరు కమ్యూనిస్టా లేక ఏంటి అని అడిగితే ఆయన నేను హ్యుమనిస్ట్ అంటూ చెప్పేవారు. ఇండియాలో మొదట పేదవాడికి ఆహార భద్రత గురించి ఆలోచించింది ఈయనే. ఆడపిల్లలకు ఆస్థిలో సమానహక్కు ఈయన ఆలోచన.

పరిపాలన వికేంద్రీరికరణ మొదట చేసింది ఈయనే. మండలాల అభివృద్ధి అలాగే రాయలసీమకు సాగు నీరు కోసం తెలుగు గంగ ఇలా అన్నీ చేసిన ఆయనకు ప్రధాని అయ్యే ఆస్కారం ఉన్నా ఆయన అవలేదు. థర్డ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న ఆయన అనుకుని ఉంటే పీఎం అయ్యుండేవారు కానీ ఆయనకు రాజకీయాల మీద అవగాహన తక్కువ అంటూ చెప్పారు. పక్క రాష్ట్రంలో ఎంజిఆర్ గారికి భారతరత్న వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారికి ఒక్క పద్మ శ్రీ తప్ప వేరే అవార్డులేవి రాలేదు. ఆయన భారతరత్నకు అర్హులే కానీ ఎవరూ ఇంతవరకు చొరవ చూపలేదు అంటూ అభిప్రాయాపడ్డారు.