Ex minister Chandrasekhar : బీజేపీ నేత మాజీ మంత్రి ఎ.చంద్ర శేఖర్ గారు తాజాగా బీజేపీ పార్టీ గురించి హాట్ కామెంట్స్ చేసారు. అధిష్టానం పార్టీ కోసం పని చేస్తున్న వారిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోతుందని ఇది పార్టకే నష్టం అంటూ వాపోయారు. తాజాగా ఈయన ధోరణి చూస్తుంటే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేలాగా కనిపిస్తోంది.

మోడీ సభకు పాస్ ఇవ్వలేదు…
తెలంగాణ లో ప్రధానమంత్రి సభ పెట్టగా అందుకు హాజరు కావాలని అనుకుంటే ఎంట్రీ పాస్ ఇవ్వలేదు. పాస్ లేకుండా ఎవరినైనా మీటింగ్ కి పంపరు. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చూసి స్పష్టం చేస్తాం అని చెప్పారు. అక్కడికి వెల్లి లిస్ట్ లో పేరు లేకపోతే వెనక్కి రావడం ఇష్టం లేక వెళ్ళలేదు అంటూ చెప్పారు చంద్రశేఖర్. వికారాబాద్ నుండి దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన చంద్ర శేఖర్ గారు మంత్రిగా కూడా పనిచేశారు.

2021లో బీజేపీ లో చేరిన ఆయన పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బండి సంజయ్ ని నమ్ముకుని బీజేపీ లోకి వస్తే ఆయననే పదవుల నుండి తీసేసారు. అందుకే చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఇపుడు ఆ విషయం గురించి స్పందించలదు. బండి సంజయ్ లాంటి కష్టపడి పనిచేసేవాళ్ళకే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ ప్రభావం బీజేపీ కి వచ్చే ఎన్నికలలో పడుతుందంటూ చెప్పారు చంద్రశేఖర్.





























