Achyuth : f2 సినిమాలో అంతేగా అంతేగా అంటూ డైలాగ్ తో అందరిని నవ్వించిన సీనియర్ నటుడు ప్రదీప్ f3 సినిమాలో కూడా నటించారు ఇక తాజాగా ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు మాట్లాడారు. జంధ్యాలగారితో పని చేయడం, ఇప్పుడున్న సీనియర్ ఆర్టిస్టులతో ఇప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక సీనియర్ సీరియల్ హీరో అచ్యుత్ గురించి ఆయన మరణానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.

అచ్యుత్ మరణానికి కారణం అదే….
ఇంద్రధనుస్సు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా అచ్యుత్ ఆ తరువాత అటు సినిమాల్లోను బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. ఇక సీరియల్స్ లో అయితే టాప్ హీరోగా ఉన్నారు అలాంటి వ్యక్తి 40 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ వల్ల మరణించారు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మరణించాడని అప్పట్లో వినిపించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను ప్రదీప్ పంచుకున్నారు.

స్మోకింగ్, మాంసాహారం వంటివి పూర్తిగా మానేసినా అధిక ఒత్తిడి వల్ల అచ్యుత్ మరణించాడని చెప్పారు. సీరియల్స్‌లో సూపర్ స్టార్ అవ్వడంవల్ల పని ఎక్కువవడం వల్ల ఒత్తిడికి లోనై గుండెపోటు వచ్చి మరణించాడని, 40 ఏళ్ల వయసులో అందరికి ఒకసారి గుండె అలారం ఇస్తుందని కానీ అచ్యుత్ విషయంలో ఎక్కువగా స్వీట్స్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల క్లోలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువై ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ముందుగా తాను గుర్తించకపోవడం వల్ల పరిస్థితి చేజారింది.

గుండె పోటు వచ్చే ముందురోజు కూడా నేను తను కలిసి మట్టిమనుషులు సీరియల్ షూటింగ్ లో ఉన్నాం. రేపు ఉదయం తిరుపతికి కృష్ణ ఎక్స్‌ప్రెస్ లో వెళ్తున్న అన్నా అని చెప్పాడు. కానీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ఉండగా అచ్యుత్ కి గుండె పోటు వచ్చిందని ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్ళాను, తన భార్య మాత్రమే ఉంది. నేను పెద్ద ప్రమాదమేమి ఉండదు అనుకున్న.. బయటపడతాడని అనుకున్న కానీ డాక్టర్లు 99% బ్రతికే అవకాశం లేదని, 1 % మాత్రమే అవకాశం అది కూడా ఒక ఇంజక్షన్ వేయాలని చెప్పారు. వేయమని చెప్పా కానీ మాస్సివ్ హార్ట్ ఎటాక్ అవ్వడం వల్ల మరణించాడు.

బాధాకర విషయం తన భార్యకు నేనే చెప్పాల్సి వచ్చింది ఇక అచ్యుత్ లేడనే విషయాన్ని అందరు అప్పటికే హాస్పిటల్ కి రావడం జరిగింది. నేను అచ్యుత్ మరణం వల్ల బాగా కుంగిపోయాను. నన్ను అన్నా అని పిలిచేవాడు. నా భార్యను వదిన అని అనేవాడు. నాపిల్లలు బాబాయ్ అని పిలిచేవారు అలాంటి వ్యక్తి మరణించడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నా తండ్రి మరణం కంటే ఎక్కువగా అచ్యుత్ మరణం నన్ను చాలా ఏళ్ళు బాధించింది అంటూ అచ్యుత్ తో తన అనుబంధాన్ని వివరించారు.



























