Facts about Nagini : పాముల గురించి సైన్స్ పరంగా ఆలోచిస్తే అవి విషపురుగులుగా పరిగనిస్తాం. కానీ హిందూ మైథాలజీ ప్రకారం పాముల గురించి పురాణాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఇక నాగకన్య అనే మాట తరచూ వింటుంటాం అయితే ఇది కేవలం హిందూ మైథాలజీకి మాత్రమే కాదు ఇతర మత విశ్వాసాల్లో కూడా వారి చరిత్ర గ్రంధాల్లో ప్రస్తావన కనిపిస్తుంది. ఇక పాముల గురించి మాట్లాడితే నాగిని గురించి అలాగే ఇచ్చాదారి నాగిని గురించి గుర్తుకు వస్తుంది. కోరికలను తీర్చుకోడానికి వాటికి కావాల్సిన రూపంలోకి మారే నాగుపాములను ఇచ్చాదారి నాగుపాములు అంటారు. ఇవి ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నాయనే నమ్మకం చాలా మందికి ఉంది, అయితే అవి మనకంటికి ఎందుకు కనిపించవు ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

రూపం మార్చే ఇచ్చాదారి నాగులు…
పూర్వం రెండు పాములు శృంగారం చేస్తుండగా చూసిన వేటగాళ్లు ఆ పాముల జంటమీద దాడి చేయగా మగ పాము చనిపోయింది. ఇక ఆడ పాము గాయాలతో శివుని కోసం తపస్సు చేసి అసాధారణ శక్తులను సొంతం చేసుకుంది. తన శత్రువులను చంపడానికి రూపాన్ని మార్చుకునే శక్తిని పొందింది. ఇవి కోబ్రా జాతికి చెందిన పాములు కావడంతో తరాతరాలుగా ఇచ్చాదారి నాగినిలుగా కోబ్రా జాతి పాములు అవుతున్నాయి. 100 ఏళ్లకు పైగా జీవించిన కోబ్రా స్వాతి నక్షత్ర సమయంలో పడిన చినుకులను తీసుకుంటే ఆ నాగుపాముకి నాగమణి వస్తుంది. ఈ నాగమణి వెలుగుతూ ఉండటం వల్ల రాత్రి పూట ఆహారం కోసం వెళ్లాలన్నా పాముకు వెలుతురు ఉంటుంది, శత్రువు నుండి రక్షించుకోగలుగుతుంది.

ఇక ఈ నాగమణి ఉన్న పాము ఇచ్చాదరి నాగిని గా మారి తన కోరికలను తీర్చుకోడానికి నచ్చిన రూపాన్ని ధరించగల శక్తి పొందుతుంది. ఈ నాగినులు ఇప్పటికీ ఉన్నాయంటూ చాలా మంది నమ్ముతారు. అయితే ఎందుకని మనకు కనిపించవు అంటే ఈ ఇచ్చాదారి నాగినుల జనాభా పెరిగి పోవడంతో బ్రహ్మ ఒకనాడు వారిని పాతాలానికి వెళ్లిపోవాలని అదేశించడంతో భూమి కింద ఉన్న పాతాళం అనే ప్రపంచంలో అవి ఉన్నాయి. అయితే అక్కడ కాంతి లేకపోయినా వాటి మణుల వల్ల ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. శాస్త్రావేత్తలు కూడా భూమి లోపల బాగాల్లో జీవించడానికి అవాసయోగ్యమైన పరిస్థితులు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మహాభారతంలో కూడా నాగకన్యల ప్రస్తావన ఉంది. ఇక ఈశ్వరుడి మెడలో ఉండే పాము వాసుకి అనే ఇచ్చాదారి నాగుపాము.































