ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మందన్న. తాజా సినిమా “సరిలేరు నీకెవ్వరు” తో అద్భుతమైన విజయంతో దూసుకుపోతుంది.. “ఛలో” సినిమా తో తెలుగు తెరకు పరిచయమై.. విజయ్ దేవరకొండ సరసన “గీత గోవిందం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన “భీష్మ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 21న రిలీజ్ కాబోయే భీష్మ చిత్రం కోసం హీరో నితిన్, హీరోయిన్ రష్మిక ఇద్దరు పోమోషన్స్ లో బిజీ అయిపోయారు. ఇటీవలే కుక్క బిస్కెట్లు తింటుందంటూ నితిన్ చెప్పిన సీక్రెట్ తో ఈ అమ్మడు వార్తల్లో నిలిచింది. అలాగే కర్ణాటకలో ఆమె ఇంట్లో ఐటి దాడుల వ్యవహారం కూడా గత కొద్దిరోజులుగా చర్చయినీయాంశమైంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక ఈవెంట్ కి హాజరైన సమయంలో ఒక అభిమాని సెల్ఫీ దిగడానికి వచ్చి… హఠాత్తుగా రశ్మికను గట్టిగ ముద్దు పెట్టుకుని ఒక్క సారిగా పరుగందుకున్నాడు. ఆ ఆగంతకుడు చేసిన పనికి రష్మిక తో పాటు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరంతా షాక్ నుంచి తెరుగుకునే లోపే అతను అక్కడి నుంచి ఉడాయించాడు. దీనితో ఆ ఈవెంట్ ఆర్గనైజర్ల పై రష్మిక ఫైర్ అయిందట. అయితే హీరోయిన్స్ కు ఇలాంటి అనుభవాలు అప్పడప్పుడు ఎదురవుతుంటాయి. చాలా మంది హీరోయిన్స్ అభిమానుల మధ్యలో ఉన్న సమయంలో చాల జాగ్రత్తగా ఉంటారు. కానీ రష్మిక అజాగ్రత్త వల్లే ఆ ఆగంతకుడు ముద్దు పెట్టి పారిపోయాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here