Faria Abdulla : చిట్టీ నీ నవ్వంటే లక్ష్మి పటాసే.. అంటూ ప్రేక్షకులకు దగ్గరైన జాతిరత్నాలు బ్యూటీ హాట్ బెల్లీ డాన్స్ తో మతిపోగొడుతోంది. జాతిరత్నాలు సినిమాలో చిట్టీ గా పరిచయమైన ఫరియా అబ్దుల్లా తన క్యూట్ నటనతో సినిమాలో ఆకట్టుకుంది. మొదటి సినిమా అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా, జాతి రత్నాలు సినిమా తరువాత మంచి అవకాశలు తెచ్చుకుంటుందనుకుంటే అమ్మడికి ఇంకా అంత మంచి ప్రాజెక్ట్స్ ఏం రాలేదు.

బెల్లీ డాన్స్ తో మతిపోగొట్టిన చిట్టీ…
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం అందుకున్న జాతిరత్నాలు సినిమా తరువాత ఫరియా కు ఆశించినంత మంచి అవకాశాలు రాలేదు. మంచి పర్సనాలిటీ, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఆకట్టుకునే ఫరియా కు అవకాశాలు రాకపోవడం విడ్డూరమే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అతిధి పాత్ర చేసింది. ఇక బంగార్రాజు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇక ప్రస్తుతం మాత్రం రవితేజ రావణాసుర సినిమాలో నటిస్తోంది.

ఇది తప్పితే మంచి అవకాశాలేవి అమ్మడి చేతిలో లేవు. కానీ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇక తన డాన్స్ వీడియోలతో రచ్చ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా ఒక ఈవెంట్ కి సంబంధించిన బెల్లీ డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రెండింగ్ లో ఉన్న గుమి గుమి పాటకు బెల్లీ డాన్స్ వేసి అదరగొట్టింది. ఇక నెటిజన్స్ ఈ వీడియోకు స్పందిస్తూ చిట్టీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా వావ్ అంటున్నారు.

































