అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్లు శృం గార సన్నివేశాలలో నటించేవారు కాదు. అటువంటి సన్నివేశాల్లో నటించడానికి ప్రత్యేకించి కొంతమంది తారలు ఉండేవారు. దర్శకులు తమ సినిమాల్లో ఒకటి అరా సన్నివేశాల కోసం ఆ తారలను పిలిపించి షూటింగులు కానిచ్చేవారు. అయితే అప్పటి హీరోయిన్లందరికీ భిన్నంగా ఉంటూ నాభి అందాల నుండి చీర లేకుండా కూడా వెండితెరపై నటించి అన్ని హద్దులను దాటేసిన మొదటి హీరోయిన్ గా దీప సంచలనం సృష్టించారు. దీప మలయాళ నటి కాగా… ఆమె అసలు పేరు ఉన్ని మేరీ. కేవలం తెలుగు, తమిళ సినిమాల కోసమే ఆమె తన పేరును దీప గా మార్చుకున్నారు.

ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించిన ఈమె తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1972 నుండి దాదాపు 10 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ, కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలలో ఎదురులేని హీరోయిన్ గా, నటిగా ఒక ఊపుఊపిన దీప 1982లో రెజోయ్ అనే ఓ కాలేజీ లెక్చరర్ ని పెళ్లి చేసుకొని… ఆ తర్వాత కూడా గ్లామర్ పాత్రలలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమెకు నిర్మల్ అనే ఒక కొడుకు ఉన్నాడు. నిర్మల్ కి రంజిని అనే యువతితో పెళ్లి కాగా వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడు.

ఆమె తెలుగులో దానవీరశూరకర్ణ, స్వాతిముత్యం, డు డు బసవన్న, రంగూన్ రౌడీ, అందమే ఆనందం, కుటుంబ గౌరవం, ఆత్మబలం, లేడీస్ టైలర్, ఘరానా రౌడీ, డబ్బెవరికి చేదు, రాము వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here