ప్రభు గణేషన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు మీకోసం !

0
644

తమిళంలో ఎంజీఆర్ తర్వాత అంతటి పేరు ఉన్న మరొక వ్యక్తి శివాజీ గణేషన్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. మన తెలుగులో ఎన్టీ రామారావు ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో తమిళంలో శివాజీ గణేషన్ కూడా అంత గొప్ప పేరును సంపాదించారు. ఇక శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు గణేషన్ చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ స్నేహితుడిగా నటించాడన్న సంగతి తెలిసిందే. ప్రభు కెరీర్ లో చిన్న తంబి(1992) సినిమా అతి పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నటించినందుకు గానూ అతనికి తమిళనాడు రాష్ట్ర ఉత్తమ హీరో అవార్డు లభించింది. ప్రభు గణేషన్ హీరో, సహానటుడు, నిర్మాత మాత్రమే కాదు మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ప్రభు గణేషన్ కుమారుడు విక్రమ్ ప్రభు కూడా సినిమా రంగంలో అరంగేట్రం చేశారు.

1956 డిసెంబర్ 27న మద్రాసు నగరంలో జన్మించిన ప్రభు గణేషన్ 1982వ సంవత్సరం నుండి సినీ పరిశ్రమలో నటించడం ప్రారంభించారు. తన కెరీర్ మొత్తంలో 200 పైచిలుకు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా సినిమాల్లో నటించారు. మొదట్లో ప్రభు చేసిన 30 సినిమాల్లో 19 సినిమాలు తన తండ్రి శివాజీ గణేషన్ నటించినవే కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ పలు హిట్ చిత్రాల్లో ప్రభు నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ప్రభు గణేషన్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీక్ తో కలిసి అగ్ని నక్షత్రం సినిమాలో నటించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగులో ఘర్షణగా డబ్ అయ్యి సంచలన విజయం సాధించి ప్రభుకి తెలుగునాట కూడా గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రభు గణేషన్ నటించిన రొమాంటిక్ డ్రామా డ్యూయెట్ కూడా తెలుగులో డబ్ కాబడి సంచలన విజయం సాధించింది. 2004వ సంవత్సరంలో కమల్ హాసన్ తో కలిసి వసూల్ రాజా, ఎంబిబిఎస్ హిందీ సినిమాలో నటించారు. 2005వ సంవత్సరంలో రజనీకాంత్ తో కలసి చంద్రముఖి సినిమాలో నటించారు. ఈ రెండు చిత్రాలతో అతను భారత దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. బిల్లా వంటి యాక్షన్ డ్రామా సినిమాలలో కూడా ప్రభు కీలకమైన పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను బాగా అలరించారు.

1982వ సంవత్సరంలో ప్రభు పునీత ను పెళ్లి చేసుకోగా… వీళ్ళిద్దరికీ ఐశ్వర్య, విక్రమ్ జన్మించారు. విక్రమ్ 2012వ సంవత్సరంలో సినిమా రంగంలో అరంగేట్రం చేశారు. అయితే ప్రభు తన భార్య పునీతను వదిలేసి ఐదు సంవత్సరాల పాటు నటీమణి కుష్బూ తో సహజీవనం చేశారు. తర్వాత ఖుష్బూ తమిళ దర్శకుడు సుందర్.సి ని పెళ్లి చేసుకున్నారు. 2008వ సంవత్సరంలో కథానాయకుడు, 2010వ సంవత్సరంలో డార్లింగ్ మరియు ఆరంజ్, 2011లో శక్తి మరియు బెజవాడ వంటి తెలుగు సినిమాల్లో నటించిన ప్రభు టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 2012లో దరువు, తూనీగ తూనీగ, దేనికైనారెడీ, ఊకొడతారా ఉలిక్కి పడతారా, 2013లో ఒంగోలు గిత్తలో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. 2017లో వీడెవడో చిత్రం ప్రభు గణేషన్ నటించిన ఆఖరి తెలుగు సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here