టాలీవుడ్ లో మెగా వారసురాలు నిహారిక గురించి ఈ విషయాలు తెలుసా.?

0
321

మెగా కుటుంబం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వార‌సులుగా ఎంతో మంది హీరోలు వెండితెర‌కు ప‌రిచ‌య‌మై ఎవ‌రి నటనలో వాళ్ళు తమ స‌త్తా చాటుకున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా కుటుంబం నుంచి వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ఒకే ఒక్క క‌థానాయిక నిహారిక కొణిదెల‌. బుల్లితెర‌పై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ అందాల భామ ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌ లలో కూడా న‌టించింది. వెండితెర‌పై “ఒక మ‌న‌సు” చిత్రంతో పరిచయమైన నిహారిక.ఆ త‌ర్వాత “హ్యాపీ వెడ్డింగ్” చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికీ ఇది ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధింలేక‌ పోయింది. ఈమధ్యనే నిశ్చితార్థం కూడా జరుపుకుని పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమౌతున్న ఈ ముద్దుగుమ్మ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

డిసెంబర్ 18న 1993 సంవత్సరంలో జన్మించిన నిహారిక తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత, టీవీ యాంకర్, అయిన మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురన్న విషయం అందరికీ తెలిసిందే. నిహారిక తాను నటి కాకముందు ‘ఢీ జూనియర్స్’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే షార్ట్ ఫిలిమ్ లో హీరోయిన్ గా నటించి మెట్రో సిటీలో పెరిగిన ఈ తరం అమ్మాయిలా జీన్ ప్యాంటులు వేసుకొనే మోడ్రన్ గర్ల్ పాత్రలో నీహారిక ఒదిగిపోయింది. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయి.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అలాగే జూన్ 2016 లో విడుదలైన ‘ఒక మనసు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక పక్కింటి అమ్మాయిలా చుడీదార్లు, చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలనని నిరూపించుకొన్నది. ఆ తర్వాత ఆమె నటించిన ‘సూర్యాకాంతం’ చిత్రం కూడా ఆశించినంతగా విజయం సాధించలేదు. నిహారిక ఓ తమిళ సినిమాలో కూడ నటించింది. సోషల్ మీడియాలో నిహారిక పెళ్ళిపై రకరకాల రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె చివరగా నటించిన చిత్రం ‘సైరా’ ఆమె పెదనాన్న చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమాలో నిహారిక ఓ బోయ పిల్ల పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన నిహారికకు ఈమధ్యనే గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైత‌న్య‌తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here