టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ తర్వాత చెప్పుకొనే పేరు దగ్గుబాటి రానా. అయితే ఇకపై ఆయన పేరు ఈ లిస్టులో ఉండదు. దీనికి కారణం దగ్గుబాటి రానా తన కాబోయే భార్య ను పరిచయం చేయడం. ఇక వీరిద్దరి నిశ్చితార్థానికి ముహూర్తం చాలా దూరం లేదని చెప్పకనే చెప్పాడు దగ్గుబాటి రానా. హైదరాబాద్ లోకల్ అమ్మాయి మన దగ్గుబాటి రానాను పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పేరు మిహికా బజాజ్. ఇక ఈమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు రానా నా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపాడు. అసలు ఎవరు ఈమె అనే సందేహంతో ప్రజలు గూగుల్ లో ఈమె గురించి తెగ వెతికే సారూ అంటే నమ్మండి. ఇంతకీ ఈమె ఎవరు…? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి …? అసలు ఏమి చదువుకుంది…? ఆవిడ ఏ వృత్తిలో కొనసాగుతోంది…? వాళ్ళ అమ్మానాన్నలు ఏం చేస్తారు …? ఇలాంటి విషయాలు మీకు తెలుసా…? తెలియకపోతే ఒకసారి ఇలా ఒక లుక్కేయండి….!

మిహికా బజాజ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. బంటి – సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె ఈవిడ. అంతే కాకుండా తను చెల్సియా యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఇక ఆమె ఇంటీరియర్ డిజైన్ డెకర్ బిజినెస్ స్పెషలిస్ట్ కూడా. అంతేకాకుండా ఆవిడ డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను స్వయంగా తానే నిర్వహిస్తున్నారు. ఇక ఈ సంస్థ వివాహాలు, ఇతర కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది.

అయితే మీహిక రకరకాల ఇంటర్వ్యూలు పరిశీలిస్తే… తన అభిరుచులు సహా పలు ఆసక్తికరమైన సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. తాను చిన్నప్పటి నుంచి ఖరీదైన నగరాల్లో డిజైనర్ ప్యాలెస్ ల సందర్శనతో ఆమె లైఫ్ చాలా కలర్ ఫుల్ గా సాగిందట. తన చిన్ననాటి జ్ఞాపకాలు బాగా సందడిగా ఉండే మార్కెట్లు, పెద్ద పెద్ద ప్యాలెస్ ల సందర్శనతో పూర్తిగా నిండిపోయిందట. ఇక ఆమె తల్లి డిజైనింగ్ రంగంలో ఆసక్తి గల పురాతన కలెక్టర్ అని ఆవిడ తెలిపింది. దీనితో తన తల్లికి ఇష్టమైన రంగాన్ని తాను కూడా ఎంచుకున్నట్లు చెబుతూనే, తన అమ్మని స్ఫూర్తిగా తీసుకుంటుందని తెలుస్తోంది.

ఇకపోతే మిహీక మామ్ బంటీ ఒక మంచి శిక్షకురాలు కూడా. ఈవిడ జ్యువెలరీ బ్రాండ్ అయిన క్రిసాలా ఆభరణాల డైరెక్టర్ & క్రియేటివ్ హెడ్. మిహీకా తన విజయం వెనక తన తల్లి ఉందని చెబుతుంటారు కూడా. ఇక మిహికా ఇంస్టాగ్రామ్ చూస్తే … ” డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో మీ వల్లనే .. ఒక అమ్మాయి తల్లి లేకుండా ఏమీ చేయలేదు …!“ అంటూ ఎమోషనల్ పోస్ట్ ని ఇన్ స్టాలో రివీల్ చేశారు ఆవిడ.




























