అలనాటి అందాల నటి నగ్మా గుర్తుందా.? “పెద్దింటల్లుడు” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ అందాల తార కోసం సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేటికీ నగ్మా పేరు చెబితేనే తెలుగు ప్రేక్షకులు పులకించిపోతారంటే అతిశయోక్తి కాదేమో.! ఆకట్టుకునే అందం, అంతకుమించిన అభినయంతో అగ్రహీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది.

తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆరోజుల్లో అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. తెలుగులో చివరగా ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అల్లరి రాముడు’ సినిమాలో అత్తగా నటించి అందర్నీ అలరించింది. టాలీవుడ్ లో హీరోయిన్ గానేనే కాకుండా లవ్ ఎఫైర్ గాసిప్స్ లలో కూడా నగ్మా సంచలనాలు సృష్టించి ఫేమస్ అయింది. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో గాసిప్స్ షికారు చేసాయి. అంతేకాకుండా శరత్ కుమార్, రవి కిషన్ లతో కూడా ఆమె ప్రేమాయణం సాగించినట్లు రూమర్స్ వచ్చాయి.

ఇవన్నీ ప్రక్కన పెట్టి నగ్మా వ్యక్తిగత విషయాలకొస్తే ఆమె కుటుంబం జైసల్మేర్ రాజరికపు ఫ్యామీలీ అనే సంగతి నేటికి చాలామందికి తెలియదు. సినిమా ఇండ్రస్ట్రీ పైకి స్వర్గ ద్వారంలా కనబడినా.. దిగితేనే కానీ లోతు తెలియదన్నట్టు నగ్మా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నగ్మాని హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం చేయడానికి పన్నెండేళ్ల వయసులోనే బలవంతంగా ఆమె శరీరంలోకి హార్మోన్స్ ఎక్కించడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటి మూలంగా నగ్మా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకొని సినిమాలకు సరిపోయే విధంగా ఆమెను తయారు చేశారనే గాసిప్స్ విని ఆమె ఫ్యాన్స్ కూడా అదే నిజం అనుకునేవారు. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన నగ్మా బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తెలుగుతో పాటు తమిళ్, హిందీ భోజ్ పురి మలయాళం కన్నడ బెంగాలీ, మరాఠీ, పంజాబీ సినీ ఇండస్ట్రీలలో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. కానీ నేటికీ ఎవ్వరికీ అంతుబట్టని విషయమేమిటంటే.. నగ్మా ఇప్పటికీ వివాహం చేసుకుకోకుండా అలాగే ఉండిపోయింది. నేటికీ నగ్మా తెలుగు తెరపై కనిపించక దాదాపు 11 ఏళ్లు దాటిపోయింది. 2009 తర్వాత ఆమె ఏ భాషలోనూ సినిమాలు చేయలేదు. సినిమాలకు దూరంగా ఉన్న నగ్మా కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయింది. ప్రస్తుతం నగ్మా రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ తనదైన శైలిలో ఆనందంగా జీవిస్తుంది. చదివారుగా అందాల తార నగ్మా కోసం ఆసక్తికరమైన విషయాలు.. ఏదైమైనా నగ్మా ఇప్పటివరకూ పెళ్ళెందుకు చేసుకోలేదో అంతుపట్టని చిక్కుప్రశ్నే..!



























