Fight Masters Ram & Lakshman : ఫైట్ మాస్టర్లుగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న అన్నదమ్ములు రామ్ మరియు లక్ష్మణ్. ఇద్దరూ కవలలు కావడం విశేషం. ఇద్దరూ కలిసి ఫైట్ మాస్టర్స్ గా సినిమాల్లో కలిసి పనిచేస్తారు. ఇప్పటి వరకు దాదాపుగా ఇద్దరూ కలిసి 300 పైగా సినిమాలకు ఫైట్ కంపోజ్ చేసారు. అయితే మొదట వీరికి గుర్తింపు ఇచ్చింది మాత్రం పూరి జగన్నాథ్. ‘ఇడియట్’ సినిమాకు ఫైట్ మాస్టర్స్ గా వీళ్లకు అవకాశం ఇచ్చారు పూరి. ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ మాస్టర్, వీళ్ళు ఒకే కాంపౌండ్ నుండి వచ్చారు.

మాట్లాడటం రాని వెధవలు అంటూ…
రామ్ & లక్ష్మణ్ ఇద్దరూ చదువు రాకపోయినా ఎంతో కష్టపడి ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. మేము మాట్లాడే భాష చాలా మందికి అర్థం కాక చాలా ఇబ్బంది పడినట్లు కొంతమంది మా ముందే మాట్లాడటం రాని వెధవలు ఫైట్ మాస్టర్లుగా ఎలా వస్తారో అంటూ అనేవారు. కొంతమంది కో- డైరెక్టర్లు, డైరెక్టర్లు విసుక్కునేవారు కానీ అది వారి తప్పు కుడా కాదు అని మేము ఏమి అనేవాళ్ళం కాదు, విననట్టు పక్కకు వచ్చేవాళ్ళం.

చెన్నై లో కొన్నిసార్లు చెంప దెబ్బలు కూడా తిన్నాము, వారు చెప్పింది అర్థం కాక ఇబ్బందులు, అవమానాలు బాగా ఎదురయ్యాయి అంటూ చెప్పారు. హీరో రవితేజ లాంటి వాళ్ళు కూడా మొదట్లో మా భాష అర్థం కాక చూసేవాళ్ళు అంటూ మొదట్లో పడిన ఇబ్బందులను రామ్ లక్ష్మణ్ తెలిపారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ జమానాలో కూడా వీరిద్దరూ చిన్న నోకియా ఫోన్ ఇప్పటికీ వాడుతున్నారు.

































