ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రం తిప్పిన చక్రి. అయన సంగీతంలో ఎన్నో పాటలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. చాలా తక్కువ సమయంలో 100 సినిమాలు పైగా అయన సంగీతం అందించారు. ఇప్పటికి అయన పాటలు దుమ్ము రేపుతాయి. అయితే అనుకోకుండా కేవలం 40 ఏళ్లకే అకాల మరణం చెందారు చక్రి. 2014 డిసెంబర్ లో అయన అనారోగ్యంతో మరణించారు. అయన అకాల మరణం తరువాత వారి కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పట్లో అయన ఆస్తులపై అనేక వివాదాలు వచ్చాయి. అయన తమ్ముడు, తల్లికి ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనే వార్తలు వచ్చాయి.

అయితే చక్రి బ్రతికి ఉన్నప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన కుటుంబం ఆయన మరణం తరువాత ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. తాజగా లాక్ డౌన్ కారణంగా చక్రి కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది. చక్రి సోదరుడు, తల్లి మణికొండలో నివాసముంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత, కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అనూహ్య రెడ్డి వారి ఇంటికి వెళ్లి రెండు నెలలకు సరిపడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. తనకు ఏదైనా పని ఇప్పించమని అడిగిన చక్రి తమ్ముడు మోహిత్ కోరిక మేరకు కరోనా పై ఒక ట్యూన్ చేయమని చెప్పారు. అయితే అనూహ్య రెడ్డి ఇచ్చిన భరోసా తమ హృదయాలను కదిలించింది చెప్పారు చక్రి సోదరుడు మోహిత్. ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన ఈ కుటుంబం ఇలా చేయిచాల్సిన స్థితికి రావడంపై అంతా కన్నీరుమున్నీరు అవుతుతున్నారు.




























