కరోనా వచ్చినా ఎవరికీ చెప్పకుండా. సినిమా షూటింగ్ లో పాల్గొన్న నటి గౌహర్ ఖాన్ పై FIR నమోదు చేసారు పోలీసులు. హిందీ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ మరియు బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్ తనకు కరోనా పాజిటివ్ అని తెలిసినా కుడా ఎవరికీ చెప్పకుండా సినిమా షూటింగ్ లో పాల్గొంది.

కోవిడ్ సోకితే ఐసోలేషన్ కు వెళ్ళకుండా సినిమా షూటింగ్ లో పాల్గొందని BMC అధికారి తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు అధికారులు. కాగా, ప్రస్తుతం గౌహర్ ఖాన్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. త్వరలోనే ఆమెను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.



























