హైదరాబాద్ నగరంలోని హబీబ్ నగర్ లో యూసుఫ్ ఫిన్ దర్గాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 15 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో అదుపు చేయడం కొంచెం కష్టమవుతుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.