హైదరాబాద్ నిజాంపేట్ లో ఒక టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట్ స్టూడియో సమీపంలో టిఫిన్ సెంటర్ లో గ్యాస్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న మరో మూడు షాపులకు వ్యాపించాయి. ఈ క్రమంలో పక్కన ఉన్న మూడు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఒక షాపు నుంచి మరో షాపుకు మంటలు మరింత వ్యాపిస్తుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు . ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు.
నిజాంపేట్‌లోని టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం. గ్యాస్ వెలిగించే క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కన ఉన్న మూడు షాపులకు వ్యాపించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.#Nizampet #FireAccident #Telangana #Hyderabad pic.twitter.com/KCkWisotHs
— TeluguDesk (@telugudesk) January 24, 2025



























