తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు తో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

తెలంగాణలో, ఈరోజు భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లోను తక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ ప్రకటించింది.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో సురక్షిత స్థలాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ, విపత్తు నిర్వహణ సంస్థల సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.






























