దేశంలో కరోనా మరోసారి విలయతాండవం చేస్తోంది. నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజగా మరో ప్రముఖ నటుడు, రియల్ హీరో, సోనూసూద్ కు కరోనా బారిన పడ్డారు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచారు సోనూ సూద్.

తాజగా జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు అయన ట్వీట్ చేసారు. తాను స్వీయ క్వారంటైన్ లో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడొద్దని, ఇప్పుడు కూడా ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కరిస్తానని నేను ఉన్నదే మీకోసం అని సోనూ సూద్ తెలిపాడు. ప్రస్తుతం సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. అయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
???? pic.twitter.com/2kHlByCCqh
— sonu sood (@SonuSood) April 17, 2021



























