Deepthi: బిగ్ బాస్ 5 వ సీజన్ ముగిసిపోయినా.. ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ఇందుకు కారణం షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన మధ్య బ్రేకప్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూలు రొమాన్స్ చేయడంతోనే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందంటూ.. ఇప్పటికే నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేశారు.

బిగ్ బాస్ లో సిరి, షన్ముఖ్ మధ్య కిస్సింగులు, హగ్గింగులు హద్దు దాటడం చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య స్నేహం కన్నా మరేరో బంధం ఉందని చాాలా మంది అనుకున్నారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఆమెను మందలించింది.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారమే షన్నూ- దీప్తి మధ్య విబేధాలకు కారణం అయింది. ఈ బ్యూటిఫుల్ పెయిర్ విడిపోవడం చాలా మందిని బాధించింది. తమ ఐదేళ్ల రిలేషన్ షిప్పుకు బ్రేకప్ చెప్పింది దీప్తి సునయన. తమ దారులు వేరని చెబూతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దీప్తి..
అయితే షన్నూతో బ్రేకప్ నుంచి ఇప్పుడిప్పుడే దీప్తి కోలుకుంటోంది. దీని కోసం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నాన్నతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ… ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది.































