దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి మృతి..!

0
79

దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ (97) ఈరోజు కన్నుమూత మూశారు. వయస్సు మీదపడంతో వచ్చే అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం సోమాజిగూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

ఈ క్రమంలో రాఘవమ్మ మృతితో ఆమె స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలం, చిరుమామిళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాఘవమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here