సుస్మితాసేన్ ఇండియన్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. 44 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తనకంటే చిన్నవాడనైన రోహమన్ షాల్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు పిల్లలంటే ఉన్న ఇష్టంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. అయితే ఇండియన్ తోలి మిస్ యూనివర్స్ అయిన సుస్మితాసేన్. ఆమె ఘనత సాధించి ఈ ఏడాదితో సరిగ్గా 26 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడు ఒక ట్వీట్ చేసాడు.

“26 ఏళ్ళు అవుతోంది జాన్… మమ్మల్ని అందరిని గర్వపడేలా చేసావు. ఇంకా చేస్తూనే ఉన్నావు.. ఐ లవ్ యు..” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. కాగా, ఈ ఘనత సాధించిన తోలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆ తరువాత బాలీవుడ్ లో హీరోయిన్ గా మారింది.. తెలుగులో కూడా అప్పుడప్పుడు తళుక్కున మెరిసింది.





























