తిన్న వెంటనే కడుపు ఉబ్బరమవడం, నొప్పి రావడం చాలా మందికి సాధారణ సమస్య. భోజనం చేసిన కొద్ది సేపటికే పొట్ట కుండలా ఉబ్బిపోవడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. వేడి నీరు, అల్లం టీ వంటివి ప్రయత్నించినా ఫలితం ఉండదు. అయితే కొన్ని సహజమైన పండ్లు ఈ సమస్యను సమర్థవంతంగా తగ్గించగలవు. ఈ పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని కూడా నియంత్రిస్తాయి.

బొప్పాయి (Papaya)
బొప్పాయి తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుందని మనందరికీ తెలుసు. కానీ ఇది కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో పపైన్ (Papain) అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అదనంగా, పేగుల్లో ఏర్పడే మంటను కూడా తగ్గిస్తుంది. భోజనం తర్వాత చిన్న ముక్క బొప్పాయి తింటే కడుపు తేలికగా అనిపిస్తుంది.
పైనాపిల్ (Pineapple)
పైనాపిల్‌లో సహజంగా జీర్ణక్రియను ప్రేరేపించే ఎంజైమ్‌లు ఉంటాయి. ముఖ్యంగా బ్రోమెలైన్ (Bromelain) అనే ఎంజైమ్ ప్రోటీన్‌ను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత కొద్దిగా పైనాపిల్ తింటే కడుపులో గ్యాస్ ఉత్పత్తి తగ్గి ఉబ్బరం రాదు. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకున్నప్పుడు ఇది మరింత ప్రయోజనకరం.
అరటిపండు (Banana)
అరటిపండు మలబద్ధకాన్ని తగ్గించే సహజ పరిష్కారం. ఇందులో ఉన్న పొటాషియం అధిక సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది, శరీరంలో నీరు నిల్వ కాకుండా చేస్తుంది. దీని వల్ల కడుపు ఉబ్బరమవడాన్ని నివారించవచ్చు. అందుకే మన పూర్వీకులు పడుకునే ముందు అరటిపండు తినడం అలవాటు చేసుకున్నారు.
కివి (Kiwi)
కివి పండులో యాక్టినిడిన్ (Actinidin) అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన అరగంటలోపు ఒక కివి తింటే అపానవాయువు ఉత్పత్తి తగ్గి కడుపులో తేలికగా అనిపిస్తుంది. అదనంగా, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
బెర్రీలు (Berries)
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలు వంటి బెర్రీల్లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పేగుల్లో మంట, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవాలంటే మందులు కాకుండా సహజమైన పండ్లతోనే పరిష్కారం పొందవచ్చు. భోజనం తర్వాత పై పండ్లలో ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపు తేలికగా ఉంటుంది, రోజంతా చురుకుగా గడపవచ్చు





























