దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ తగ్గేదే లేదన్నట్టుగా పెరిగిపోతున్నాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. గత పది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రెట్లు పెరగడం ఇది తొమ్మిదోసారి. ఇప్పటి వరకూ పెట్రోల్ పై రూ. 7.22, డీజిల్ పై రూ. 6.96 చొప్పున పెరిగాయి.

ఇక తాజాగా పెరిగిన రేట్లతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది. అటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 117.29, లీటర్ డీజిల్ రూ.102.96 కు గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు భారీగా పెరిగడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు ఇలా ప్రతిరోజూ వడ్డించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.



























