G. Nageswar reddy : ‘6 టీన్స్’ తో డైరెక్టర్ గా మొదలయిన నాగేశ్వరెడ్డి కామెడీ ప్రధాన సినిమాలను ఎక్కువగా తీశారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ, కరెంటు తీగ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన జీ నాగేశ్వరెడ్డి గారు తాజాగా ‘జిన్నా’ సినిమాకు కథను అందించారు. మంచు కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న నాగేశ్వరెడ్డి గారు మంచు విష్ణు తో రెండు, మంచు మనోజ్ తో ఒక సినిమా తీశారు. ఇక జిన్నా సినిమాకు దర్శకత్వం ఎందుకు చేయలేదు, సినిమా ఎందుకు హిట్ కాలేదు అనే విషయాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సినిమా ఫ్లాప్ అవడానికి వాళ్ళే కారణం…
జిన్నా సినిమాకు జీ నాగేశ్వరెడ్డి గారు కథను అందించారు. దర్శకత్వం ఆయన వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నారు. అయితే సినిమా కథ, నటీ నటుల ఎంపిక మొత్తం ఆయనే చూసుకున్నారు. ఇక డైరెక్షన్ సూర్య చేసారు. కోన వెంకట్ ఈ సినిమాకు పనిచేసారు, అలాగే సినిమాకు ఫైనాన్స్ కూడా చేయడం వల్ల మరింత జాగర్తలు తీసుకున్నారు అంటూ చెప్పారు. సినిమా మొత్తం షూటింగ్ అయ్యాక సినిమా విష్ణు తో కలిసి చూసాను, చాలా బాగా వచ్చిందని అనుకున్నాం. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది రిలీజ్ అయ్యాక. కానీ సినిమాకు కలెక్షన్స్ రాలేదు నష్టం వచ్చింది.

మంచు ఫ్యామిలీ మీద చేసే విపరీతమైన ట్రోల్స్ దీనికి కారణం. ట్రోలర్స్ మరీ వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం సినిమా చూడకండి అనే రేంజ్ కి ప్రచారం చేయడం వల్ల జనాలకు మంచు ఫ్యామిలీ మీద నెగెటివ్ ఒపీనియన్ పడింది. అందువల్లే సినిమా ఆడలేదు. 90% ట్రోల్లర్స్ ఈ సినిమా పోవడానికి కారణమని నా అభిప్రాయం అంటూ నాగేశ్వరెడ్డి గారు అభిప్రాయాపడ్డారు. ఇక సినిమా కు బాగా నష్టం వచ్చిందని చెబుతూ ఓటిటిలో విడుదల అయ్యాక సినిమా జనాలు చూస్తారని అభిప్రాయపడ్డారు.
































