G V Narayana : అంతులేని కథ సినిమాతో సినిమాలకు పరిచయమైన నారాయణ గారు ఆ తరువాత హీరోగా సినిమాలు చేసారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసిన ఆయన అంతులేని కథ సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. ఇక ఒక ఊరి కథ సినిమాతో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. ఇక సినిమాలతో పాటు సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. ముగ్గురు మొనగాళ్లు వంటి హిట్ చిత్రాలను నిర్మించారు.

ఎన్టీఆర్ తో పోటీ తట్టుకోలేక ఏఎన్ఆర్ హైదరాబాద్ వచ్చేసారు…
ఇక అప్పటి విషయాలను మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలివచ్చినప్పటి విషయాలను మాట్లాడారు. అప్పట్లో విజయ సంస్థకు పర్మినెంట్ హీరోగా ఎన్టీఆర్ ఉండేవారు. ఇక ఏఎన్ఆర్ గారు తనకంటూ నిర్మాణ సంస్థలు ఉండాలని భావించి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే ఏఎన్ఆర్ హైదరాబాద్ వచ్చేయాలని భావించి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. ఇక చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వస్తే బాగుంటుందని భావించి రాయితీ ధరలకు స్థలాలు అలాగే సినిమాలు తెలుగు రాష్ట్రము లో తీస్తే టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు.

అలా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిందని జీవీ నారాయణ తెలిపారు. ఇక హైదరాబాద్ లో శోభన్ బాబు గారికి సావిత్రి గారికి ఇల్లు ఉండేవి ఇక్కడ షూటింగులు ఉన్నపుడు వాళ్ళ ఇంట్లో ఉండేవారు పని అయ్యాక చెన్నై వెళ్లిపోయే వారని తెలిపారు. ఇక చాలా ఏళ్ల తరువాత ఇల్లు అమ్మేసారని తెలిపారు. ఇక నాగేశ్వరావు గారి చొరవతో సారధి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, అనతికాలంలో రామకృష్ణ, రామానాయుడు స్టూడియోలు వచ్చాయని చెప్పారు.



























