Galata Geetu : బిగ్ బాస్ ఇంగ్లిష్ నుండి దిగుమతి చేసుకున్న ఈ షో ఇండియాలో కూడా మంచి ప్రజాధరణ పొందింది. బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలోనూ మంచి రేటింగులు రాబడుతోంది. తెలుగులో కూడా అయిదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆరవ సీజన్ మొదలైంది. ఆరవ సీజన్లో అపుడే అభినయ శ్రీ, షాని ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో గొడవలు, కాంట్రావర్సీలు, ఫన్, ఎమోషన్స్ ఇలా అన్నింటిలోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో గలాటా గీతు చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బాలాదిత్య కు సలహాలు ఇస్తూ నోరు జారిన గీతు…
చిత్తూరు యాసలో తనకు తానే నేను ఇంతే.. ఇలానే ఉంటాను.. ఎవరికోసం మారను అంటూ చెప్పుకుంది. ఇంట్లో కూడా నేను ఇంతే ఇలానే గట్టిగా పైకి మాట్లాడుకుంటాను అని తన గురించి తాను చేప్పుకుంది. ఆటలలో కూడా గెలవాలనే ఉద్దేశంలో తనకు నచ్చినట్టు అడేస్తోంది. ఇది తప్పో ఒప్పో పక్కనపెడితే హోస్ట్ గా ఉన్న నాగార్జున మాత్రం బాగా ఆడుతున్నావ్ అంటూ పొగడ్తలతో ముంచేత్తాడు. 200 శాతం ఆట ఆడావు అని నాగార్జున అంటే కేవలం 20 శాతం మాత్రమే ఆడాను అంటూ ఓవర్ కాంఫిడెన్స్ ప్రదర్శించింది. గీతను పొగుడుతూనే మిగిలిన వాళ్లకు చురకలు వేసాడు.

బాలాదిత్య గురించి మాట్లాడుతూ.. అందరికీ సలహాలు ఇవ్వడం ఆపేసి నీ ఆట నువ్వు ఆడుకో అన్నట్టు చెప్పాడు. దీంతో హౌస్లో బాలాదిత్యకు గీతు ఇలా సలహాలు ఇచ్చింది. ప్రపంచంలో అందరూ రిచ్ అయితే బాత్రూంలు కడగడం, చెప్పులు కుట్టడం, కాలువలు క్లీన్ చేయడం ఇలాంటివి అన్నీ ఎవరు చేస్తారు. అలాగే హౌస్ లో కూడా అందరూ సూపర్ కంటెస్టెంట్లు ఉంటే ఎలిమినేట్ ఎవరు అవుతారు. నువ్వు అందరికీ వెళ్లి సలహాలు ఇచ్చి వాళ్ళ నెగిటివ్స్ ని పాజిటివ్ గా మార్చాల్సిన పని లేదు. అదే ప్రీచింగ్ అంటే అని వాగుతుంటే ఆదిత్య మాత్రం దాన్ని అలానే లాగకుండా పక్కకు వెళ్ళిపోయాడు.



























